రాష్ట్రీయం

నిరంతర శివ స్వరూపమే గురు శివానందమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, జూన్ 27: నిరంతర శివ స్వరూపమైన ఆధ్యాత్మిక శక్తే సద్గురు శివానందమూర్తి అని విశాఖ వడ్లపూడి యోగానందాశ్రమానికి చెందిన ఆధ్యాత్మికవేత్త రామకృష్ణానంద భాసించారు. సద్గురు శివానందమూర్తి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక బ్యాంకు కాలనీ వద్ద ఆనందవనంలో గురూజీ సంస్మరణ సభ జరిగింది. ముందుగా ఆశ్రమంలో గల దేవుడి ప్రాంగణంలో శివానంద చిత్తరువు ముందు అర్చకులు మనోహర్ నేతృత్వంలో పలువురు అర్చకులు ప్రత్యేక పూజలు గురూజీ పాదపూజ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఆధ్యాత్మిక సభలో పాల్గొన్న రామకృష్ణానంద గురూజీ తత్వంపై భక్తులకు ప్రబోధించారు.
సంపూర్ణ భారతీయత మూర్త్భీవించిన పరమ శివతేజ్సు గల మహిమాన్విత స్వరూపమే శివానందమూర్తి అని భాసంచారు. భారతీయుల ఆనంద సౌభాగ్యాలను కాంక్షించి ఆసేతుహిమాచలం పర్యంతం సంచరించి భగవత్ విభూతిని అనుభూతిగా ప్రజలలో ప్రబోధం చేసి పావనమూర్తి గురుదేవులు కందుకూరి శివానందమూర్తి అని అన్నారు. దేశభక్తియే నిజమైన దైవభక్తిగా మంజువర్తనులై ప్రకాశించిన సమగ్ర దేశభక్తులు గురుదేవులు అన్నారు. ఉపాధిని (శరీరం) వీడినా సకల జీవకోటిలో వారి తేజస్సు సంక్పలమై మానవులను శివతత్వంపై జాగృతి పరచిన అపర శివస్వరూపుడు శివానందమూర్తి అని భక్తులకు ఉపదేశించారు. భీమిలి పీఠాన్ని భాసించిన ఆనంవనాన్ని ఆనందానుభూతితో ఆధ్యాత్మిక క్షేత్రంగా మలచి భక్తులను ఆనంద, ఆధ్యాత్మిక సమ్మోహితులను చేసిన గురూజీ సృష్టి ఉన్నంత వరకు ఆయన పాదధూళి స్మర్శరేణులు వ్యాపించబడాలని భాసించారు. తూర్పు భారతావని ఆర్థికస్థితిని అందుకోవాలని కాంక్షించి ఆనందవనంలో మహలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించి మహలక్ష్మి అమ్మవారి దేవాలయం ద్వారా తూర్పువాసులకు ఆర్థిక సౌభాగ్యాలను సంకల్పించిన పరమ పావన, అపర శివ స్వరూపులు గురూజీ శివానందమూర్తి అని రామకృష్ణానందుల వారు భక్తులకు బోధించారు.
అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో శృంగేరీపీఠం నుండి సచ్చిదానందతీర్థ, ఉత్తరాంధ్ర వైఖాసన ఆగమ మండలాధ్యక్షులు రొంపిచర్ల సింగమాచార్యులు, ఆశ్రమవాసులు శర్మ, పలువురు భక్తులు పాల్గొన్నారు.

గురూజీ ఆశ్రమంలోని గణపతి ఆలయంలో శివానందమూర్తి చిత్రపటం వద్ద పూజలు నిర్వహిస్తున్న దృశ్యం