రాష్ట్రీయం

గురుధామంలో శివానందేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్(కల్చరల్), జూన్ 27: వరంగల్‌లో ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరారుతున్న గురుధామంలో ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త సద్గురు శ్రీశివానందమూర్తి ప్రథమ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. శివానందమూర్తి శివైక్యం చెంది సంవత్సరం పూరె్తైన సందర్భంగా ఆయన ఆరాధనోత్సవాన్ని కుటుంబ సభ్యులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. వరంగల్ పట్టణ శివార్లలోని గురుధామ్‌లో సోమవారం భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులు, భక్తులంతా కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సద్గురువుల సమాధిపై సమస్త శోడషోపచారాలతో, వివిధ యంత్రాల సహితంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివలింగానికి గురువుగారి అనుగ్రహంతో శివానందేశ్వరుడిగా నామకరణం చేశారు. శివానందమూర్తి కుమారులు సనాతనధర్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరబసవరాజు, రాజశేఖర్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని శైవపీఠాధిపతి అత్తులూరి మృతుంజయ శర్మ నేతృత్వంలో వేద బ్రాహ్మణులు జగన్నాథ శర్మ, అమర్‌నాథ శర్మ, నాగరాజ శర్మలు నిర్వహించారు. గణపతి పూజ, అంకురార్పణ, రక్షాబంధనంతో పూజాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తరువాత శివలింగ పంచాయతనానికి అధివాసయుక్త పూజలు చేసి ప్రతిష్ఠ చేసే స్థలంలో నవరత్నాలు పాదరసం ఇత్యాది వాటిని మంత్రయుక్తంగా వేసి పరమేశ్వర యంత్రాన్ని ప్రతిష్ఠించారు. మండప స్థిత దేవతా హోమాలను జరిపారు. అనంతరం హోమం చేసిన విభూతిని భక్తులకు అందించారు. ఆ తరువాత మహదాశీర్వచనం జరిగింది. ఈ కార్యక్రమానికి సద్గురు శివానందమూర్తి శిష్యులు, పురప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విదేశీయులు హాజరయ్యారు. వీరిని శివానందమూర్తి ట్రస్ట్ సభ్యులు గోపీచంద్ తదితరులు సాదరంగా ఆహ్వానించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిత్రాలు ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సద్గురు శివానందమూర్తి విగ్రహం
సద్గురు శివానందమూర్తి సమాధిపై శివలింగం ప్రతిష్ఠాపన చేస్తున్న కుటుంబ సభ్యులు