జాతీయ వార్తలు

పాక్‌తో కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: భారత్ ఎల్లవేళలా పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీనతకు, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు అని ఆయన సోమవారం ఒక ఆంగ్ల వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం విషయంలో భారత్ చేస్తున్న వాదనను ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ పట్టువీడకుండా తన వాదనను వినిపిస్తూ పోవడం వల్లనే ఇది సాధ్యమయిందని ఆయన పేర్కొన్నారు. తాను లాహోర్‌ను సందర్శించడం, పాకిస్తాన్ ప్రధానిని ఇక్కడికి ఆహ్వానించడం వంటి చర్యలతో కూడిన స్థిరమైన ప్రయత్నాలతో ఉగ్రవాదానికి సంబంధించి తన వాదనను భారత్ చాలా బలంగానే చాటిచెప్పగలిగిందని, ఆ విధంగా ప్రపంచ దేశాలను ఒప్పించగలిగిందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాద నిర్మూలనపై భారత్ చేస్తున్న వాదనను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో బలపరుస్తున్నాయని, ఈ పరిస్థితి పాకిస్తాన్‌కు ఇరకాటంగా మారిందన్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితులను మొత్తం ప్రపంచ దేశాలన్ని గమనిస్తున్నాయని పేర్కొన్న మోదీ ‘గతంలో ఉగ్రవాదంపై భారత వాదనకు అంత బలం ఉండేది కాదు. చాలా సందర్భాలలో దీన్ని శాంతిభద్రతల సమస్యగా పరిగణించేవారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న వాదనను ప్రస్తుతం ప్రతి దేశం అంగీకరిస్తోంది. దీనివలన కలిగే అమానుషాలపైన దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.
ఎన్‌ఎస్‌జి సభ్యత్వంపై ఆశాభావం
అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వానికి సంబంధించి బలమైన సానుకూల పరిణామాలు మొదలయ్యాయని మోదీ తెలిపారు. ఈ విషయంలో చైనా నుంచి అభ్యంతరం వస్తున్నప్పటికీ ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం లభించగలదన్న ధీమా తనకు ఉందన్నారు. ఇందుకు అమెరికా సహా అన్ని దేశాల నుంచి వస్తున్న సానుకూల ప్రతిస్పందనలే నిదర్శనమని తెలిపారు. చైనాతో భారత్‌కు అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ముఖాముఖి చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వంపై ఎంతో కృషి చేశాయని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, షాంఘై సహకార సంస్థలో సభ్యత్వం, అలాగే ఎంటిసిఆర్‌లో సభ్యత్వంపై విశేషంగానే పాటుపడ్డాయన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏదున్నా ఈ ప్రయత్నాలు మాత్రం పటిష్ఠంగానే సాగుతూ వచ్చాయని తెలిపారు.