రాష్ట్రీయం

రెండు రోజులు వర్షాలే వర్షాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి పశ్చిమ దిశగా 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతాలు ఈ విధంగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 14 సెంటీమీటర్లు, తణుకు 9 సెంమీ, చింతలపూడి, తాడేపల్లిగూడెంలో 6 సెంమీ, ధవళేశ్వరం, చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నంలో 5 సెంమీ వర్షపాతం నమోదైంది.

చిత్రం గాజువాకలో కురిసిన భారీ వర్షానికి జలమయమైన జాతీయ రహదారి