రాష్ట్రీయం

ముహూర్తం కుదిరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 27: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ కార్యాలయాలు బుధవారం లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. భవనాల్లో 5వ బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధం కావడంతో నాలుగు శాఖలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పంచాయతీరాజ్, వైద్యారోగ్య, గృహ నిర్మాణం, స్ర్తి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలను సంబంధిత మంత్రులు ప్రారంభిస్తారు. సచివాలయానికి దశలవారీగా సంబంధిత శాఖల కార్యాలయాలను తరలిస్తారు. జూలై 6న 5వ బ్లాకు ఫస్ట్ ఫ్లోర్‌లోకి రవాణా, రోడ్లు భవనాలు, కార్మిక శాఖలను తరలిస్తారు. 1వ బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్ జూలై 15 నాటికి సిద్ధమవుతుంది. ఇందులో సాధారణ పరిపాలనా విభాగం (జిఎడి)కి సంబంధించిన విభాగాలు ఏర్పాటవుతాయి. ఇదే బ్లాకులో ఫస్ట్ ఫ్లోర్ ముఖ్యమంత్రి పేషీ కోసం సిద్ధమవుతోంది. జూలై 21న సిఎం తన కార్యాలయంలోకి ప్రవేశిస్తారు. 2వ బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో హోం, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు కేటాయించారు. వచ్చే నెల 15న ఆ విభాగాలను తరలిస్తారు. ఇదే బ్లాకు ఫస్ట్ ఫ్లోర్ జూలై 21న ప్రారంభమవుతుంది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. 3వ బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్యోగులకు అవసరమైన క్యాంటిన్‌లు, రెస్టారెంట్లు, ఇతర సదుపాయాలు ఉంటాయి. ఈ భవనాన్ని వచ్చే నెల 15 తేదీనే ప్రారంభిస్తారు.
ఉద్యోగులకోసం బస్సులు రెడీ
వెలగపూడికి గుంటూరు, విజయవాడల నుంచి ఉద్యోగులు తరలివచ్చేందుకు ఎపిఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. విజయవాడ పిఎన్‌బిఎస్‌తో పాటు మరో 6 డిపోల నుంచి ఉదయం 8.30 గంటల నుండే బస్సు సర్వీసులు నడుపుతారు. గుంటూరు, మంగళగిరి నుంచి సచివాలయానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

చిత్రం ప్రారంభోత్సవానికి సిద్ధవౌతున్న సచివాలయం. అంతర్గత పనుల్లో కార్మికులు