రాష్ట్రీయం

మానవత్వం పరిమళించిన వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: నగర పోలీసు కమిషనర్ కావాలనే ఓ బాలుడి కోరిక తీరింది. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన అరౌనా అనే ఎనిమిదేళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతున్న ఆ బాలుడు పోలీసు కమిషనర్ కావాలనే కోరిక బలంగా ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన మేక్-ఎ-విష్ ఫౌండేషన్ సంస్థ సదరు బాలుడి కోరిక గురించి నగర పోలీసు కమిషనర్‌కు విన్నవించింది. బాలుడి ఆరోగ్య స్థితి, కోరికను వివరించింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆ బాలుడికి ఒక్క రోజు కమిషనర్‌గా అవకాశం ఇచ్చారు. దీంతో ఆ బాలుడి కోరిక తీరినట్టయింది. ఆ బాలుడి కోరిక తీర్చినందుకు కమిషనర్‌కు మేక్ ఎ విష్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

అభిమాని ఇంటికి బన్నీ
విజయవాడ (పాయకాపురం), డిసెంబర్ 15: తన అభిమాన నటుడిని చూడాలని ఒక అవ్వ కోరుకున్న కోరికను మీడియా ద్వారా తెలుసుకుని స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. అవ్వ కళ్లల్లో సంతోషాన్ని చూశాక తనకు ఆనందంగా ఉందని అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న షేక్ మస్తాన్‌బీ (64)కి నలుగురు మగ, ఇద్దరు ఆడ సంతానం ఉన్నారు. హాస్య నటుడు అల్లురామలింగయ్య అంటే ఆమెకు ఎనలేని అభిమానం. ఆమె మూత్ర క్యాన్సర్‌తో చరమాంకంలో ఉంది. తాను త్వరలోనే చనిపోతానని తెలుసుకున్న మస్తాన్‌బీ తనకు అల్లు అర్జున్‌ను చూడాలని ఉందని కోరింది. అల్లు అర్జున్ నృత్యాలంటే తనకెంతో ఇష్టమని, తాను చనిపోయేలోగా అల్లును చూడాలని ఒక మీడియా ఛానల్ ద్వారా తెలిపింది. తన అభిమానిని చూసేందుకు స్వయంగా ఆయనే కదిలి వచ్చారు. ఆమె కోలుకోవాలని పండ్లు అందించారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానిని మంగళవారం
విజయవాడలో కలిసి పలకరిస్తున్న నటుడు అల్లు అర్జున్

మంగళవారం కార్యాలయంలో సిటీ కమిషనర్‌గా
అరౌనాను సీట్లో కూర్చోబెట్టిన సిపి మహేందర్ రెడ్డి