రాష్ట్రీయం

జేబులు నింపుతున్న జీవో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 27: ‘ఒక ఇల్లూ లేదు.. ఒక బిల్లూ లేదు’ అన్నట్టుగా గోళ్లు గిల్లుకుంటున్న గృహ నిర్మాణ శాఖకు గతేడాది జారీ అయిన ఓ జీవో అధికారుల పాలిట కల్పవృక్షంలా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని హాయిగా కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖలోని ఒక ఉన్నతాధికారి చక్రం తిప్పి, ఈ జీవోను జారీచేయించినట్టుగా సమాచారం. వివరాల్లోకి వెళితే... సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రాజెక్టుకైనా అవసరమైన సిమెంటు, ఇసుక, ఇనుము తదితరాలకు స్టాండర్డ్ షెడ్యూలు రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం ఎస్టిమేట్లు తయారుచేసి, టెండర్లు పిలుస్తుంటారు. దాని ప్రకారమే కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుని పనులు చేస్తుంటారు. ఒక్కోసారి పనులు పూర్తికావడంలో జాప్యం జరిగితే నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి, కాంట్రాకర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని సృష్టించేందుకు ఒక ఇంజనీరింగ్ ఉన్నతాధికారి చక్రంతిప్పడంతో గత ఏడాది మేలో జిఒ ఆర్‌టి నెం 76, తేదీ:18/5/2015 జారీ అయింది. ఐహెచ్‌ఎస్‌డిపి, బిఎస్‌యుపి, ఆర్‌జికె, ఇందిరమ్మ పేర్లతోవున్న 14 హౌసింగ్ ప్రాజెక్టులకు, ఆరు వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా అదనంగా రూ.33.76 కోట్లు చెల్లించడానికి ఈ జీవోలో అనుమతించారు.దీన్ని అడ్డుపెట్టుకుని 2008 నుంచి 2014 వరకు వివిధ స్కీముల పేరుతో నిర్మించిన ఇళ్ల సముదాయాల ప్రాజెక్టులకు ఇపుడు తాజాగా ఎస్కలేషన్ పేరుతో నిధులను రాబడుతున్నారు. దాదాపుపదేళ్ల క్రితం నిర్మించిన ఇళ్ల ప్రాజెక్టులకు ఇనుము, సిమెంటు, నిర్మాణ సామాగ్రి, వౌలిక సదుపాయాల్లో వ్యత్యాసాన్ని ఇపుడు చెల్లిస్తుండటం విశేషం. వాస్తవానికి అప్పటి ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం సదరు ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ఎపుడో నిర్మాణం పూర్తయి, ఆ ఇళ్లన్నీ లబ్ధిదారులకు పంపిణీ అయిన తర్వాత ఇప్పటికీ ఆయా ప్రాజెక్టులకు ఎక్స్‌కలేషన్ పేరుతో సిమెంటు, ఇనుము, నిర్మాణ సామగ్రి, వౌలిక సదుపాయాల పేరుతో నిధులు చెల్లించడం విశేషం. మొత్తం రూ.33.76 కోట్ల చెల్లింపునకు జీవో అనుతించగా, ఇప్పటివరకు సుమారు రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో పదహారు ప్రాజెక్టులకు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్క ప్రాజెక్టుకు 2008 నుంచి 2014 మధ్య నిర్మించిన వాటికీ ఎక్స్‌కలేషన్ చార్జీలు చెల్లించారు. ఆయా ప్రాజెక్టులు నిర్మించిన కాంట్రాక్టర్ల పేరిట లేఖలు పెట్టించి, నిధులు మంజూరుచేయించి, కాంట్రాక్టర్లకు కొంత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఇంజనీరింగ్ అధికారులే హోదాల వారీగా వాటాలు పంచుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి, గృహనిర్మాణ శాఖలో జరుగుతున్న జీవో నెం 76 చెల్లింపులను తక్షణం నిలుపుచేసి, బాగోతంపై పూర్తిస్థాయి విచారణ జరిపితే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.