రాష్ట్రీయం

తీరమే మాకు తరగని సంపద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారాలు, తదితర అంశాలను పారిశ్రామిక దిగ్గజాలకు వివరించి భారీగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలమునకలైపోయారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, ద్వైపాక్షిక చర్చలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ప్రపంచ పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం అమరావతిలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తులు చేశారు. ప్రపంచంలోని 280 దేశాల్లో పార్శిల్, కార్గో సేవలను అందిస్తున్న యునైటెడ్ పార్శిల్ సర్వీసెస్ గ్రూప్ కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ జాన్ విల్లెం బ్రీన్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎపిలో రవాణా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. ఎపిఎస్ ఆర్టీసీ జిపిఎస్ వ్యవస్థకు అనుసంధానమై ఉందని ఆయనకు తెలిపారు. విశాఖ, కృష్ణపట్నం ఓడరేవులను కార్గోహబ్‌లుగా ఏర్పరచుకోవాలని బ్రీన్‌కు సూచించారు. ఈసందర్భంగా బ్రీన్ స్పందిస్తూ తమ సంస్థ బిజినెస్ టు బిజినెస్‌లోనే కాదు, బిజినెస్ టు కన్స్యూమర్ పద్ధతిని విశ్వసిస్తుందని చెప్పారు. చంద్రబాబు సోమవారం జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ యాసుషి అకాహోషితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌తో జెట్రో సంస్థకు మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయని, గత పర్యటనలు సత్ఫలితాలు ఇచ్చాయని చంద్రబాబు చెప్పారు. తూర్పు తీరానికి ముఖద్వారమైన ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి డీప్ సీవాటర్ పోర్టులు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఇలాంటి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వ్యాపారాలు బాగా సాగుతాయని చెప్పారు. జపాన్, తదితర ఆసియా దేశాలకు ఆంధ్రప్రదేశ్ మంచి గమ్యస్థానమని అన్నారు. ఉత్పత్తి పరిశ్రమలకు ఇక్కడి పర్యావరణం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. జెట్రో ప్రెసిడెంట్ యాసుషి అకాహోషి చంద్రబాబు ప్రసంగానికి స్పందిస్తూ తాము త్వరలోనే విజయవాడకు ప్రతిపాదనలతో వస్తామని తెలిపారు.

చిత్రం చైనాలో ఇతిహాద్ ఎయర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పొన్నుసామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ