రాష్ట్రీయం

పెట్టుబడుల ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రెండో రోజు బడా కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఏపిలో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను వివరించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో 43,120 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయడానికి చైనా అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైన్యూర్స్, చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ లిమిటెడ్ (బీజింగ్)లతో ఎపిఈడిబి, ఇండస్ట్రీస్, కామర్స్ మినిస్ట్రీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ప్రకారం 6036 కోట్ల రూపాయల పెట్టుబడితో బిల్డింగ్ మెటీరియల్ ఇండస్ట్రియల్ పార్క్, 36,889 కోట్లతో మోడ్రన్ బిల్డింగ్ మెటీరియల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పార్కుల్లో 45వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ ఒప్పందాలతో ఎపిలో తొలిసారిగా ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటవుతుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో 10వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్ 6.4 బిలియన్ డాలర్ల పెట్డుబడితో ఏర్పాటుకానుంది. ఇందులో 55వేల మందికి ఉపాధి లభించనుంది. 43,120 కోట్ల వ్యయంతో పూర్తికానున్న ఇండస్ట్రియల్ పార్క్‌లో మొదటి దశలో 10,106.2 కోట్లు, రెండో దశలో 12,127 కోట్లు, మూడో దశలో 14,148.8 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. తొలిదశలో 10వేల మందికి, రెండో దశలో 21వేల మందికి, మూడో దశలో 24వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం మీద ఈ పార్క్ ప్రారంభమైతే లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించబోతోంది.
కృష్ణపట్నంలో ఎరువుల కర్మాగారం
ఇదిలావుండగా కృష్ణపట్నం సమీపంలో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. చైనా హాంక్యూ కంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఇసోమెరిక్ హోల్డింగ్స్, ఎల్‌ఇపిఎల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏపిఇడిబి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం 10,183 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో కృష్ణపట్నం సమీపంలో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటవుతుంది. ఈ కర్మాగారం వల్ల ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2017-18 సంవత్సరాల మధ్య ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమవుతుంది.

చిత్రం టియాంజిన్‌లో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి
విదేశీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు