రాష్ట్రీయం

వైభవంగా అమ్మవారి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 15:శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహన సేవలలో ముఖ్యమైన రథోత్సవం మంగళవారం భక్తుల గోవింద నామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. రథంపై అమ్మవారు ప్రసన్నమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆత్మ రధికుడని, శరీరం రథమని, బుద్ధి సారధి కాగా, మసస్సు పగ్గమై, ఇంద్రియాలు గుర్రాలుగా, విషయాలనే వీధులలో సాగుతాయని కఠోరోపనిషత్తు చెబుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం అమ్మవారు రథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. మంగళవారం ఉదయం నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత ఐదుగంటలకు అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చకస్వాములు రథంపై అధిరోహింపచేశారు. ఉదయం 7.15 గంటలకు వృశ్చిక లగ్నంలో రథాన్ని లాగడంతో రథోత్సవం ప్రారంభమైంది. యువతుల కోలాటాలు, భజన బృందాలు, సాంప్రదాయి వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ అమ్మవారు ప్రసన్నమూర్తిగా రథంపై తిరుమాడ వీధిలో రథోత్సవం కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడకృష్ణమూర్తి, ఇ ఓ డి.సాంబశివరావు, జె ఇ ఓ పోలాభాస్కర్, అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి పాల్గొన్నారు. కాగా రాత్రి ఏడుగంటలకు అశ్వవాహనంపై కల్కి రూపంలో అలమేలు మంగ భక్తులకు అభయమొసగారు. వాహనం ముందు జియ్యర్ స్వాములు, శ్రీవైష్ణవ స్వాముల ప్రబంధ గానం, వాయిద్య విశేషాలు శోభాయమానంగా సాగాయి.
నేడు పంచమీ తీర్థానికి డేగ కళ్లతో నిఘా
శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం పంచమీతీర్థం. ఈ పంచమీతీర్థంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుచానూరుకు చేరుకుంటారు. సుమారు 3నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని టిటిడి అంచనావేస్తోంది. ఇందుకు తగ్గట్టుగా భారీ భద్రతా ఏర్పాట్లను టిటిడి యంత్రాంగం, పోలీసుయంత్రాంగం చేపట్టింది. టిటిడి విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులేకాకుండా ఆక్టోపస్ దళాలు కూడా అమ్మవారి పంచమీతీర్థం జరిగే ప్రదేశాలను డేగకళ్లతో పర్యవేక్షించనున్నారు.

తిరుచానూరులో మంగళవారం జరిగిన పద్మావతీ అమ్మవారి రథోత్సవం