రాష్ట్రీయం

జాతీయస్థాయిలో విద్యానిథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 8,44,328 సీట్లు మిగిలిపోయినట్టు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. వీటిలో గరిష్ఠంగా దాదాపు లక్షన్నర సీట్లు తెలుగురాష్ట్రాల్లోనే మిగిలిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 16 లక్షల వరకూ సీట్లుండగా, అందులో 8 లక్షల వరకూ సీట్లు భర్తీ కాలేదు, దాంతో ఎఐసిటిఇ మరో మారు ప్రత్యేక బృందాలను పంపించి సీట్లు నిండని కాలేజీల్లో పరిస్థితులపై సమగ్ర నివేదికలను తెప్పించుకుంది. ఎలాంటి సౌకర్యాలు లేని కాలేజీలు దాదాపు వెయ్యి వరకూ ఉన్నట్టు లెక్క తేలింది. వాటికి రానున్న 2016-17 విద్యాసంవత్సరానికి అనుమతి ఇవ్వకున్నా అందుబాటులో ఉన్న సీట్లు సరిపోతాయనే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో 99 శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి, అలాగే ప్రసిద్ధి చెందిన సాంకేతిక విద్యాసంస్థల్లో కూడా 98 నుండి 99 శాతం సీట్లు భర్తీ అవుతున్నప్పుడు కేవలం కొన్ని విద్యాసంస్థల్లోనే కనీసం 5 నుండి 10 శాతం వరకూ కూడా సీట్లు భర్తీ కాకపోవడానికి కారణం అక్కడి పరిస్థితులేనని ఎఐసిటిఇ అధికారులు విశే్లషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 300 కాలేజీల్లో కేవలం 50 చొప్పున మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. మరో పక్క జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఐఐటి, జెఇఇ ఇతర ప్రవేశపరీక్షలకు లెక్కకు మించి అభ్యర్థులు హాజరవుతుండగా, రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిస్థితులపై చేపట్టాల్సిన సర్దుబాటు చర్యలపై ఎఐసిటిఇ విశే్లషిస్తోంది. సౌకర్యాల కల్పనపై అప్పటికపుడు రికార్డులను చూపిస్తున్నా, దీర్ఘకాలంగా సిబ్బందిని, సౌకర్యాలను కొన్ని విద్యాసంస్థలు నిర్వహించడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం నేషనల్ అకడమిక్ డిపాజిటరీ నిర్వహించాలని చూస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రతి విద్యాసంస్థ డాటాను ఆయా సంస్థల బాధ్యులు నిర్వహించడమేగాక, ప్రభుత్వ పరంగా కూడా రికార్డులను కేంద్రం ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచనుంది. అలాగే ఎప్పటికపుడు కాలేజీలకు సంబంధించిన సమస్యలను సైతం ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేసి అనుమతి ఇవ్వనున్నారు.
మూడు ట్రిపుల్ ఐటిలు
రాంచీ, నాగపూర్, పుణెలలో ఈ విద్యాసంవత్సరం నుండి మూడు ట్రిపుల్ ఐటిలు ప్రారంభించనున్నారు. మరో పక్క ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక విశ్వవిద్యాలయాన్ని సౌకర్యాల పరంగా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దనున్నారు.