ఆంధ్రప్రదేశ్‌

స్విస్‌చాలెంజ్ విధానం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పనులను స్విస్ చాలెంజ్ పద్ధతిలో విదేశీ కంపెనీలకు కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ లోటస్ పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్విస్ చాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించలేదన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీని వైకాపా ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఖజనాపై భారం పడే విధానాలను మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తగదన్నారు. సదావర్తి భూములను అక్రమంగా, చట్టవిరుద్ధంగా విక్రయించారని ఆమె ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆమె కోరారు.
యువతిని వేధించిన
యువకులపై నిర్భయ కేసు
అర్బన్ ఎస్పీ జయలక్ష్మి హామీ
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూన్ 28: ప్రేమించలేదని ఇంటర్మీడియట్ చదవే విద్యార్థినిపై స్కూటర్‌తో ఢీకొట్టి హత్య చేయడానికి విఫల యత్నం చేసి పారిపోయిన ఇద్దరు యువకులపై నిర్భయ చట్టం ప్రయోగిస్తామని జిల్లా అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. మంగళవారం రేణిగుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అనంతరం తిరుపతిలో ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు దారుణంగా వ్యవహరించిన తీరుపై విలేఖరులు ఆమె దృష్టికి తీసుకురాగా ఆమె స్పందిస్తూ ఈ కేసును పరిశీలిస్తున్నామని దాడికి పాల్పడిన యువకులు కడప కోర్టులో లొంగిపోయి, బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించి స్థానిక పోలీసులకు అప్పగించిందన్నారు. వీరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నిర్భయ కేసును పెట్టడానికి ఆర్బన్ ఎస్పీ జయలక్ష్మి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి కనక భూషణం లే ఔట్‌కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిని ప్రేమించమని నవీన్ అనే యువకుడు వేధించేవాడు. అయితే పరీక్షలు ముగిసి ఫలితాలు రాగా నవీన్ పరీక్ష తప్పాడు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీ సాయంత్రం బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెడుతున్న సమయంలో నవీన్ తన స్నేహితుడు యశ్వంత్‌తో కలసి తన స్కూటర్‌తో ఢీకొట్టాడు. ఈ సంఘటనలో విద్యార్థిని కింద పడిపోయి ఆసుపత్రి పాలైంది. ఆమె వెనె్నముక దెబ్బతిందని డాక్టర్లు చెప్పారు. అంతకుముందు బాధితురాలి తండ్రి రుయా ఆసుపత్రికి తీసుకువెళ్ళిన సమయంలో కూడా నవీన్ తన స్నేహితుడితో తప్పతాగి వెళ్ళాడు. ఈ విషయాన్ని బాధితురాలి తండ్రి ఔట్ పోలీస్ స్టేషన్లో చెప్పినా పోలీసులు స్పందించలేదు. దీంతో బాధితురాలి తండ్రి ఆలస్యంగా సోమవారం రాత్రి మీడియా దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది.