రాష్ట్రీయం

ఇలా బదిలీ..అలా రద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29:పార్టీ మారితే పెత్తనం సాగించవచ్చన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రకాశం జిల్లాలో మరోసారి చుక్కెదురయింది. నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి ఏరికోరి చేయించుకున్న బదిలీలను, కరణం బలరాం వర్గం పట్టుబట్టి రద్దు చేయించడంతో, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పరాభవం మిగిలింది. దానితో కరణం వర్గీయులపై లోకేష్‌కు ఫిర్యాదు చేసేందుకు వారంతా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇటీవల పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో సీఐ, ఇరిగేషన్ ఇంజనీర్ల బదిలీల కోసం చంద్రబాబు, లోకేష్‌తో సిఫారసు చేయించి, అనుకున్నది సాధించారు.అద్దంకి సీఐగా ఉన్న బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేయించిన ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, అక్కడ హైమారావును నియమించుకున్నారు. కందుకూరు, గిద్దలూరు, చీరాల, కనిగిరి నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు సూచించిన వారికి అటాచ్‌మెంట్ పోస్టింగులు ఇస్తూ గుంటూరు రేంజి డిఐజి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలిసిన టిడిపి సీనియర్లు దివి శివరాం, అన్నా రాంబాబు, పోతుల సునీత జిల్లా సీనియర్ నేత కరణం బలరాం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే బలరాం, చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ సీనియర్లను మనస్తాపానికి గురిచేస్తోందని బాబుకు వివరించారు. దానితో ఉదయానికల్లా మళ్లీ సీన్ మారింది. అటాచ్‌మెంట్ పోస్టింగులు రద్దు చేస్తున్నామని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశాలు రావడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు చీరాల నియోజకవర్గంలో బాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమంచికి కొమ్ముకాసి, టిడిపి నేతలపై దాడులు చేసిన పోలీసు అధికారికి పోస్టింగు కోసం ప్రయత్నించడమంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీపై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతోందని కరణం వర్గీయులు మండిపడుతున్నారు. అదే సమయంలో అద్దంకి నియోజకవర్గంలో ఇరిగేషన్ ఎస్‌ఈపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి నీరు-మీరు పనులను ఆపివేయడంతోపాటు, తనకు కావలసిన అధికారిని తెచ్చుకోవడంపై ఆగ్రహించిన కరణం ఆ బదిలీని మళ్లీ నిలిపివేయించి, మరో అధికారిని నియమించుకునేలా చూడటంలో విజయం సాధించారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలు నియమించిన జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికి పెన్షన్లు ఇస్తుండగా, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా వందల సంఖ్యలో పెన్షన్లు మంజూరు చేయించుకున్న వైనం కరణం దృష్టికి రావడంతో, వాటిని కూడా నిలిపివేయించారు. ఫలితంగా ఒక్క అద్దంకి నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గొట్టిపాటి సిఫారసు చేసిన 2500 పెన్షన్లు రద్దయిపోయాయి. కాగా, జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిశోర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తున్నారని కరణం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.