రాష్ట్రీయం

నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో తిరుపతి, అమరావతి, విజయవాడలలో నైపుణ్య శిక్షణకు ప్రత్యేక భవనాలు నిర్మించాలని ఆదేశించిన ఆయన జిల్లా స్థాయిలో డిఆర్‌డిఎకి శిక్షణ బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. విజయవాడలో రెండో రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకతను వివరించారు. ఏ గైడెన్స్, లక్ష్యం లేకుండా ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. 60 శాతం మందికి పైగా జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ఆవశ్యకత చాలా ఎక్కువ ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఫిషరీస్ రంగంలో శిక్షణ ఇవ్వడంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నైపుణ్యాభివృద్ధి పథకం ‘లైఫ్’ని కూడా సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, చదువుకోని వాళ్లకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని శాఖలతో కలిసి నైపుణ్య శిక్షణపై చర్చించి, సమన్వయం చేసుకోవాలని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావును ముఖ్యమంత్రి కోరారు.
రానున్న రెండేళ్లలో నైపుణ్యం కలిగిన 2.28 లక్షల మంది అవసరం ఉందని, అది దృష్టిలో పెట్టుకుని శిక్షణ కార్యక్రమం కొనసాగించాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు యువతకు కలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ‘వికాస’ పేరుతో నిరుద్యోగుల వివరాలు సేకరించి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖలో సాధించిన వండర్స్ నుంచి కలెక్టర్లు స్ఫూర్తి పొంది, తమ జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ చేయాలన్న పట్టుదల, అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై చర్చించిన అనంతరం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సదస్సులో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.