ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఇ ఇళ్లల్లో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 29: రాష్ట్ర విద్యా సంక్షేమ వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఇడబ్ల్యుఐడిసి) సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (కేంద్ర బృదం) బుధవారం సోదాలు నిర్వహించింది. గత కొంతకాలంగా ఎస్‌ఇ కర్రి భాస్కరరావుపై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి కేంద్ర బృందం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. సుమారు రూ 1.63 కోట్ల మేర ఆస్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో వివిధ హఓదాల్లో పనిచేసిన భాస్కరరావు, అతని బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు విశాఖలోని ఆయన కార్యాలయంలో లో ఎసిబి బృందం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 లక్షల నగదు, 2.25కిలోల బంగారు ఆభరణాలు, విశాఖ నగరంలో రెండు ఫ్లాట్లు, 3 నివేశన స్థలాలు, రాజమండ్రిలో ఒక నివేశన స్థలం, రూ.10 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.3 లక్షల బ్యాంకు నిల్వలు, రెండు కార్లు, మరో రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు. స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్ల వరకూ ఉండవచ్చని ఎసిబి అధికారులు వెల్లడించారు. ఎస్‌ఇ భాస్కరరావుకు చెందిన బ్యాంకు లాకర్లు, ఇతర ఆస్తుల వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు.