రాష్ట్రీయం

విరమణకు వేళాయె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: నవ్యాంధ్రలో ప్రభుత్వ సిబ్బంది పదవీ విరమణ కాలం మొదలయింది. సిబ్బంది పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఎనలేని ఆనందం కలిగించారు. ఇప్పుడా రెండేళ్ల గడువు పూర్తి కానుండటంతో రిటైర్మెంట్ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు 2014లో చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, ఉద్యోగులపై తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆ సందర్భంగా చెప్పారు. అంతే కాదు, ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని, డిఏను కూడా త్వరలో ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
బాబు ప్రభుత్వ ఉత్తర్వు ఫలితంగా మొత్తం 8987 మందికి లబ్థి చేకూరింది. పెంచిన రెండేళ్లు పూర్తి కావడంతో జూన్ 30 1272 మంది రిటైరయ్యారు. అదే విధంగా జులైలో 2561 మంది, ఆగస్టులో 1005 మంది, సెప్టెంబర్‌లో 610 మంది, అక్టోబర్‌లో 523 మంది, నవంబర్‌లో 378 మంది, డిసెంబర్‌లో 476 మంది, వచ్చే ఏడాది జనవరిలో 601 మంది, ఫిబ్రవరిలో 436 మంది, మార్చిలో 479 మంది కూడా రిటైర్ కాబోతున్నారు.
ఈ లెక్కన మొత్తం 8341 మంది వచ్చే వార్షిక సంవత్సరానికి రిటైరవనున్నారు. కాగా, వీరిలో నెలకు 30 వేల రూపాయల లోపు వేతనం ఉన్నవారు 1577 మంది, 30 నుంచి 40 వేల లోపు వేతనం ఉన్నవారు 1685 మంది, 40-60 వేల జీతం పొందేవారు 2861 మంది, 60 వేల రూపాయల పైన వేతనం తీసుకునేవారు 22,218 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో ఇరవై వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం, గత మంత్రివర్గ సమావేశంలో ముందుగా పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖలలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సమస్యల వల్ల, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే మంచిదని భావించిన ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానివల్ల తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేయించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.