రాష్ట్రీయం

పెట్టుబడుల జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 30: ఆంధ్ర ప్రదేశ్‌కు విస్తృతంగా పెట్టుబడులు రాబట్టేందుకు గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన పర్యటన విజయవంతమైంది. నవ్యాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా అవకాశాలున్నాయని, ప్రభుత్వ పరంగానూ విస్తృత ప్రోత్సాహం లభిస్తుందంటూ చైనా కంపెనీల్లో చంద్రబాబు ఆసక్తి కలిగించగలిగారు. కుదిరిన ఒప్పందాలు, సంతకాలు జరిగిన అవగాహనా పత్రాలను బట్టి చూస్తే చంద్రబాబు పర్యటన మంచి ప్రతిస్పందనే వచ్చినట్టు స్పష్టం అవుతోంది. గురువారం ఆరు చైనా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పవర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పొరేషన్ వచ్చే పదేళ్లలో దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఎపిలోని 13 జిల్లాల్లో వౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక విద్యుత్, విద్యుత్ ఉత్పత్తి,ప్రసారం, పారిశ్రామికాభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది. దీని వల్ల 10వేల మందికి ఉపాధి లభించనుంది. ఒప్పంద పత్రాలపై గిజో ఇంనీరింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గో వి, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఓ జె కృష్ణకిశోర్ సంతకాలు చేశారు. అదేవిధంగా చైనా స్టేట్ కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, వౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, నిర్మాణ పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కృషిలో తన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎపికి అందిస్తుంది. ఈ మేరకు పై సంస్థ ప్రతినిధి హె టింగ్, కృష్ణకిషోర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సౌత్ హ్యూటన్ కంపెనీ లిమిటెడ్, ఎపి ఎకనమిక్ డవలప్‌మెంట్ బోర్డు సంయుక్తంగా ఎపిలో పట్టణాభివృద్ధిపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలలో మంచినీటి సరఫరా, డ్రైనైజ్, సివరేజ్ ట్రీట్‌మెంట్, సముద్రపు నీటిని తిరిగి వినియోగించుకునే ప్రాజెక్ట్‌ల్లో సౌత్ హ్యూటన్ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పంద పత్రాలపై సంస్థ ప్రెసిడెంట్ ఝిక్వికై, జిఐఐసి సిఇఓ ఝాంగ్ ఝూవో, ఎపి ఎకమిక్ డవలప్‌మెంట్ బోర్డు సిఇఓ కృష్ణకిశోర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పనున్న బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ పార్క్ నిర్మాణంలో గిజోచాంగ్ తైవాన్ ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది. ఒప్పందపత్రాలపై పై కంపెనీ సిఇఓ ఝు ఝాంగ్ హాంగ్ సంతకాలు చేశారు. అదేవిధంగా ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ భవన నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ సమకూర్చుతుంది. భవన నిర్మాణ రంగానికి ఉపకరించే రాతి పనిముట్లు, డ్రిల్లింగ్ పరికరాలు, గనుల తవ్వకంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం, వౌలిక సదుపాలయాలకల్పనా రంగంలో ప్రత్యక్ష పెట్డుబడులు పెడుతుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు గణనీయంగా ఉపాధి లభించనుంది. ఒప్పంద పత్రాలపై కంపెనీ ఎండి ఝు గాంగ్ సంతకం చేశారు.
ఇదిలా ఉండగా గిజో మారిటైమ్ స్కిల్ రోడ్ ఇంటర్నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ పార్క్‌లో ఈ సంస్థ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది. ప్రాజెక్ట్‌ల రూపకల్పన, నిర్మాణంలో సహకారాన్ని అందిస్తుంది. పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఈ సంస్థ ఎపి ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఒప్పందపత్రాలపై జిఐఐసి సిఇఓ ఝాంగ్ ఝావో సంతకాలు చేశారు.

చిత్రం.. చైనాలో చంద్రబాబు నాయుడు