రాష్ట్రీయం

మలేసియా ప్రధానితో కెటిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: మలేసియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఒక పారిశ్రామిక పార్క్ నిర్మాణం చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు ఆ దేశ ప్రధాని నజీబ్ టున్ రజాక్‌ను కోరారు. విదేశీ పర్యటనలో ఉన్న కెటిఆర్ గురువారం మలేసియా ప్రధానితో దాదాపుగంట సేపు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి కెటిఆర్ వివరించారు. వౌలిక వసతుల రంగంలో కొన్ని మలేసియా కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పని చేస్తున్నాయని , తెలంగాణలో పెట్టుబడులు పెట్టే మలేసియా కంపెనీలకు సహకారం అందిస్తామని ప్రధాని రజాక్ ఈ సందర్భంగా కెటిఆర్‌కు తెలిపారు. తెలంగాణలో పర్యటించాలని మలేసియా ప్రధానిని కెటిఆర్ కోరగా అందుకు ఆయన సమ్మతించారు. వచ్చే సంవత్సరం తెలంగాణలో పర్యటిస్తానని రజాక్ తెలిపారు. అంతకు ముందు కెటిఆర్ మలేషియా వౌలిక వసతుల శాఖ క్యాబినెట్ శాఖ మంత్రి డాటో సెరి సామీ వెల్లుతో భేటీ అయ్యారు. తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, ఐటి, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్న అవకాశాలను మంత్రి కెటిఆర్ వివరించారు. కాగా డబుల్ బెడ్‌రూమ్ పథకంలో పాలు పంచుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తితో ఉందని ఆయన కెటిఆర్‌కు తెలిపారు. మలేషియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఒక పారిశ్రామిక పార్క్ నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఏసియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్‌తో మంత్రి కెటిఆర్ గురువారం కౌలలంపూర్‌లో సమావేశమయ్యారు. సుమారు 20కి పైగా కంపెనీలు హాజరైన ఈ సమావేశంలో తెలంగాణలో అవినీతికి ఆస్కారం లేకుండా అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాన్ని కెటిఆర్ వివరించారు. దేశంలో తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయ రాష్టమ్రని వివరించారు. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమ శాఖ ఇన్ఫర్మేషన్ రిపాసిటరీ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వ్యాపార వాణిజ్య అవకాశాల సమాచారం ఇరు ప్రాంతాల కంపెనీల మధ్య సాధ్యం అవుతుందని చెప్పారు.
తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ తో కలిసి పని చేసేందుకు కౌలలంపూర్ రిజినల్ సెంటర్ ఫర్ అర్బిట్రేషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. మలేసియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన డిన్నర్ సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. సమావేశంలో 70 మంది సిఇఓలు పాల్గొన్నారు.

చిత్రం.. మలేసియా ప్రధాని నజీబ్ టున్ రజాక్‌ను కలిసిన కెటిఆర్