బిజినెస్

విస్తరించని తెలంగాణ గ్రామీణ బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ‘ఒక రాష్ట్రం..ఒకే గ్రామీణ బ్యాంకు’ అన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా కొన్ని రాష్ట్రాల్లో ఒకే గ్రామీణ బ్యాంకు నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఈ లక్ష్యం అమల్లోకి రాలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ‘తెలంగాణ గ్రామీణ బ్యాంకు’ ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. 2014లో నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అయితే నోటిఫికేషన్ మాత్రం అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లోనే (రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్) తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టిజిబి) నడుస్తోంది. మిగతా ఐదు జిల్లాల్లో (వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్) ఎపి గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఎపిజివిబి) నడుస్తోంది.
తెలంగాణలోని ఎపి గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కావలసి ఉన్నా ఇప్పటి వరకు కాలేదు. దీనికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎపి గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లు కలిసిపోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పది జిల్లాల్లో ఇప్పటి వరకు విస్తరించలేకపోయిందని తెలుస్తోంది.
గతంలో తెలంగాణలో ఒక్కో జిల్లాకు ఒక గ్రామీణ బ్యాంకు ఉండేది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ఇవి విలీనం అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గోల్కొండ, శాతవాహన, సరస్వతి తదితర గ్రామీణ బ్యాంకులను కలిపి ‘తెలంగాణ గ్రామీణ బ్యాంకు’గా మార్చారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ బ్యాంకు పనిచేస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు తెలంగాణ ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఆచరణలోకి రావడం లేదు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఎపి గ్రామీణ వికాస్ బ్యాంకును విలీనం చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా నాబార్డు తరఫున ఒక ప్రతినిధి, టిజిబి, ఎపిజివిబిల చైర్మన్లతో ఒక కమిటీని కేంద్రం నియమించింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణకు చెందిన ఐదు జిల్లాల్లో నడుస్తున్న ఎపి గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలను కలపవచ్చంటూ సిఫార్సు చేసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఈ కమిటీ అందచేసింది. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) స్పాన్సర్ చేస్తుండగా, ఎపిజివిబిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) స్పాన్సర్ చేస్తోంది. ఎస్‌బిహెచ్ కన్నా ఎస్‌బిఐ పెద్ద బ్యాంకు కావడం వల్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఎపిజివిబిని విలీనం చేయకూడదని ఎపిజివిబి ఉద్యోగుల సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి. ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ప్రస్తుతం సమస్య టిజిబి-ఎపిజివిబి మధ్యనే కాకుండా, ఎస్‌బిఐ-ఎస్‌బిహెచ్‌ల మధ్య కూడా ప్రారంభమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)ను విలీనం చేయాలన్న ప్రతిపాదన గత మూడేళ్ల నుండి నడుస్తోంది. ఇది ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
ఈ పరిస్థితిలో రెండు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు కూడా తమ భవిష్యత్తుకు సంబంధించి ఆందోళన చెందుతున్నారు. రెండు గ్రామీణ బ్యాంకులు విలీనం అయితే తమకు లాభం జరుగుతుందని టిజిబి ఉద్యోగులు భావిస్తున్నారు. రెండు గ్రామీణ బ్యాంకులు విలీనం కావడం వల్ల రైతులకు, వృత్తిపనివారికి, సామాన్య ప్రజలకు కూడా ఉపయోగకరంగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.