రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో కానరాని జల‘కళ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు బోసిపోయి ఉన్నాయి. ఎక్కడా నీటి జాడ కనపడడం లేదు. వచ్చే రెండు నెలలు కుండపోత వర్షం పడితేకాని ఒక మేరకు జలాశయాల్లో నీరు చేరే అవకాశాలు కనపడడంలేదు. ఎగువ రాష్ట్రం కర్నాటకలో ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నిండి గేట్లు ఎత్తినతర్వాత కాని నీటి ప్రవాహం దిగువున ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు చేరదు. ఆల్మట్టి గేట్లు ఎత్తితే దిగువకు వచ్చే నీరు, అదే సమయంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు రోజుల తరబడి కురవాల్సి ఉంటుంది. కర్నాటకలో ఆల్మట్టి కెపాసిటీ 129.72 టిఎంసి అయితే, ఇప్పుడు 14.31 టిఎంసి నీరు ఉంది. నారాయణ్‌పూర్‌లో 37.64 టిఎంసికి 15.62 టిఎంసి నీరు ఉంది. తెలంగాణలో జూరాలలో 9.66 టిఎంసికి 3.16 టిఎంసి నీరు నిల్వ ఉంది. ఆంధ్ర, తెలంగాణలో శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టిఎంసికి, 20.40 టిఎంసి నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లో 312.05 టిఎంసి సామర్ధ్యం ఉండగా, 122.52 టిఎంసి నీటి లభ్యత ఉంది. పులిచింతలలో 45.77 టిఎంసి నీటి సామర్ధ్యం కాగా, ఇప్పుడు కేవలం 2.25 టిఎంసి నీటి నిల్వ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టులో 100. 86 టిఎంసి నీటి సామర్ధ్యంకు కేవలం 3.74 టిఎంసి నీరు నిల్వ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా ఒకటిన్నర లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదులుతున్నారు.