రాష్ట్రీయం

దుప్పికోసం మాటువేసిన చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 30: తిరుమలలో స్థానికులు నివాసం ఉంటున్న వెస్ట్ బాలాజీ నగర్‌లో గురువారం మరో పులి అరగంట సేపు మాటు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో ఇటీవల పులుల సంచారం పెరిగిన విషయం పాఠకులకు విదితమే. గురువారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో పులి గాండ్రింపులు వినపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు, మీడియాకు, విజిలెన్స్ సిబ్బందికి అందించారు. అందరూ హుటాహుటిన వెస్ట్ బాలాజీ నగర్‌లోని అటవీప్రాంతంలోకి వెళ్ళారు. ఆ సమయంలో ఓ పులి చెత్తకుప్పతొట్టి పక్కన సంచరిస్తూ ఉండటాన్ని గమనించారు. పులిని తరిమేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఓ దుప్పి అటుగా వెడుతుండటాన్ని గమనించారు. దుప్పిని గమనించిన పులి దానిని వేటాడటానికి వెంటపడుతూ అడవిలోకి వెళ్ళింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఏ క్షణంలో వస్తుందోనని రాత్రంతా జాగరణ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పులిని చూసి పారిపోయిన దుప్పి దానికి ఆహారంగా మారిందా లేక తప్పించుకుని పారిపోయిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పులి మాటు వేసిన దృశ్యాలను, దుప్పి వెడుతున్న దృశ్యాలను స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు.

చిత్రం.. తిరుమలలో నివాస ప్రాంతాల వద్ద మాటువేసిన చిరుత పులి