రాష్ట్రీయం

రీ-డిజైన్‌తో ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 2: గోదావరి జలాలపై అంతర్రాష్ట్ర జలమండలి కుదుర్చుకున్న ఒప్పందాలకు మహారాష్ట్ర అంగీకారం తెలుపడంతో తెలంగాణ ప్రభుత్వం స్వల్ప మార్పులతో బ్యారేజీ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదిలాబాద్ ప్రాజెక్టుగా మారుస్తూ జీవో 607ను జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణానికి మహారాష్టల్రో పెద్దగా ముంపులేకపోవడం, అటవీ, వన్యప్రాణి, మైనింగ్ అనుమతులకు లైన్‌క్లియర్ కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందంతో ముడిపడనుంది. ఈ ప్రాజెక్టు తుమ్మిడిహట్టికి కిలోమీటర్ దూరంలోని శివుని గ్రామ సమీపంలో ప్రాణహితపై నీటి లభ్యత ఆధారంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 607 ప్రకారం ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌తో రెండేళ్లలో పూర్తి చేసేందుకు రూ.4204 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పునరాకృతిలో గతంలో తవ్విన కాల్వలను రైతులకు వినియోగంలోకి తీసుకరానున్నారు. ఇదిలావుంటే 2008 డిసెంబర్‌లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో, రీ-డిజైనింగ్ పేరిట బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు కుదించి 20 టిఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునేలా అంగీకారం కుదుర్చుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లా తూర్పు ప్రాంతంలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వ్యాప్కో లైడార్ సర్వే ఆధారంగా గతంలో నిర్మించిన 72 కిలోమీటర్ల కాల్వల ద్వారా ప్రాణహిత నుండి 20 టిఎంసీలను వినియోగించుకునేలా ఇరు రాష్ట్రాలు కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు పూర్తిగా సమ్మతించడంతో ఈనెల 15న ముంబయిలో జరగనున్న రెండు రాష్ట్రాల సిఎంల సమావేశంలో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై సంతకం చేయనున్నారు. దీంతో అడ్డంకులు అధిగమించి ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం ప్రాణహిత నదీజలాలు వినియోగంలోకి రానున్నాయి. కొత్తగా ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయడంతో మొత్తం ఐదు ప్రాణహిత ప్యాకేజీల్లో మూడవ ప్యాకేజీ వద్ద 1919 కోట్ల వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టి, సాగు నీరు అందించనున్నారు. ప్రాజెక్టు పునరాకృతిలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గంలో మూడు మండలాలకు 31,500 ఎకరాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు 58,900 ఎకరాలు, సిర్పూర్‌టి నియోజకవర్గంలో మూడు మండలాల్లో 55,200 ఎకరాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన మండలంలో 21,900 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. మొదటి ప్యాకేజీలో 164 కోట్లు, రెండో ప్యాకేజీలో 151 కోట్లు, మూడో ప్యాకేజీలో 1919 కోట్లు, నాల్గవ ప్యాకేజీలో 1640 కోట్లు, ఐదో ప్యాకేజీలో 325 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
నిర్వాసితులకు పరిహారం పెంపు
మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిహారంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో, మహారాష్టత్రో ఈనెల 15న కుదిరే ఒప్పందంలో ప్రభుత్వం ఆచితూచి అడుగుల వేస్తోంది. ప్రాణహిత కింద ముంపునకు గురయ్యే రైతులకు గతంలో ఎకరాకు రూ.లక్షా 27 వేలు ఖరారుచేయగా, ఈసారి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.5లక్షల వరకు పరిహారం అందించి భూమికి బదులు భూమితోపాటు ఆమోదయోగ్యమైన పునరావాసం, ఎస్సీ, ఎస్టీ ముంపు గ్రామాల బాధిత రైతులకు భారీస్థాయిలో ఆర్థిక లబ్ది చేకూర్చేలా సిఎం యోచిస్తున్నట్టు సమాచారం. పరిహారం విషయంలో ఈనెల 15న ప్రభుత్వం విధాన నిర్ణయ ప్రకటన జారీ చేయనున్నట్టు తెలిసింది.

చిత్రం.. ప్రాజెక్టుల రీ-డిజైన్‌లో భాగంగా కౌటాల మండలం శివుని గ్రామ పరిధిలో
ప్రాణహిత బ్యారేజీ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం