రాష్ట్రీయం

ఎంవిఐ ఆస్తి వంద కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ సోమవారం ఏసిబికి చిక్కిన బాలా నాయక్ ఆస్తి సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2006కు ముందే బాలా నాయక్ పెద్ద ఎత్తున అక్రమార్జన చేశాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్‌పోస్ట్ వద్ద అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే ఇతని అక్రమార్జన విషయం తెలుసుకుని ఏసిబి అధికారులు దాడులు చేశారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లా, తదితర ప్రాంతాల్లో 12 ఇళ్ల స్థలాలు, రంగారెడ్డి జిల్లాలోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో మూడు అంతస్థుల కమర్షియల్ కాంప్లెక్స్, గుంటూరు జిల్లాలో 25 ఎకరాల పొలంతోపాటు, ఇతరత్రా ఆస్తులు సంపాదించాడు. అప్పటి ఏసిబి దాడుల తరువాత ఆయనపై ఏసిబి అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. అయితే అతనిపై శాఖాపరమైన దర్యాప్తుతోనే ఆశాఖ ఉన్నతాధికారులు సరిపెట్టారు. ఆ దాడుల తరువాత చాలా వరకూ ఆయన అక్రమార్జన.. సక్రమార్జనగా మారిపోయిందని ఏసిబి వర్గాలు చెప్పుకొచ్చాయి. ఆ దాడుల తరువాత కూడా బాలానాయక్ అక్రమ సంపాదన ఏమాత్రం తగ్గలేదు. 2006 నుంచి ఇప్పటి వరకూ అంటే గడచిన తొమ్మిదేళ్లలోనే సుమారు 35 కోట్ల రూపాయల మేర అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడు. ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ జరిపిన దాడుల్లో సుమారు 30 కోట్ల రూపాయల వరకూ అక్రమార్జన బయటపడింది. శ్రీకాకుళంలోని బాలా నాయక్ బావమరిది బాలా నాయక్‌పేరిట ఉన్న లాకర్‌ను తెరిచారు. ఇందులో ఐదు లక్షల రూపాయల నగదు, అర కిలో బంగారం, 2.5 కిలోల వెండి, మూడు ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు గుర్తించారు. బాలా నాయక్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అతనికి 29వ తేదీ వరకూ రిమాండ్ విధించారు. కాగా, బాలా నాయక్ అక్రమార్జనకు సహకరిస్తున్న ఆయన బావమరిది బాలాజీ నాయక్‌పై దర్యాప్తు కొనసాగుతోందని ఏసిబిసిఐయు డిఎస్పీ రమాదేవి వెల్లడించారు.

మార్చిలో రైల్వే సమ్మె
విశాఖపట్నం, డిసెంబర్ 15: ఏడవ వేతన సంఘం సిఫారసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, దీంతోపాటు రైల్వే కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో సమ్మెకు దిగుతున్నట్టు భారతీయరైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ప్రకటించారు. విశాఖ రైల్వేస్టేషన్ సమీపానున్న శ్రీనివాస కల్యాణమండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, జాతీయ కార్యచరణ కమిటీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సమ్మెపై చర్చించామన్నారు. దీనిలోభాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వరకు తమ సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికుల నుంచి అభిప్రాయ సేకరణ కోసం సమ్మె బ్యాలెట్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మెజారిటీ ఓట్లు సమ్మెకు దిగేందుకు అనుకూలంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

రూ.2లక్షల లంచం తీసుకుంటుండగా
గుడివాడ సిటివో అరెస్టు

గుడివాడ, డిసెంబర్ 15: కృష్ణా జిల్లా గుడివాడ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంపై మంగళవారం సాయంత్రం ఎసిబి అధికారులు దాడి చేసి రూ.2లక్షలు లంచం తీసుకుంటున్న సిటివో రామారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగిరిపల్లిలో ఎం ఉమామహేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు 2005లో వేరుశనగ విత్తనాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సీడ్‌ను మహారాష్ట్ర స్టేట్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏటా రిటర్న్స్ వేస్తూ పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిసి ఆథరైజేషన్‌ను అనుసరించి ప్రతి ఏటా ఆడిట్ చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో సిటివో రామారావు ఆడిట్ చేసి రూ.15లక్షల పన్ను బకాయి ఉన్నట్టు ఉమామహేశ్వరరావుకు నోటీసు ఇచ్చారు. అయితే తాను ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని రాతపూర్వకంగా ఉమామహేశ్వరరావు సిటివోకు తెలియజేశారు. అటెండర్ గంగరాజుతో మాట్లాడాలని సిటివో రామారావు ఉమామహేశ్వరరావుకు సూచించారు. ట్యాక్స్ రిలీఫ్ చేయాలంటే రూ.6లక్షల లంచాన్ని సిటివోకు ఇవ్వాలని అటెండర్ గంగరాజు చెప్పాడు. దీనికి అంగీకరించని ఉమామహేశ్వరరావు విజయవాడ ఎసిబి కార్యాలయాన్ని సంప్రదించారు. ఎసిబి డిఎస్పీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు సిటివోతో ఉమామహేశ్వరరావు బేరసారాలు జరిపారు. చివరకు రూ.4.50 లక్షలకు బేరం కుదిరింది. ముందుగా రూ.2లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని, తర్వాత మిగతా సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఎప్పటికపుడు ఎసిబి అధికారులు గమనిస్తూ వచ్చారు. రూ.2లక్షల నగదును లంచంగా అటెండర్ గంగరాజుకు ఇవ్వగా ఆ మొత్తాన్ని కవర్‌లో పెట్టి ట్యాక్సీ ఆపరేటర్ షరీఫ్‌కు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈమేరకు సిటివో రామారావు, అటెండర్ గంగరాజు, డ్రైవర్ షరీఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా సిటివో, అటెండర్ నివాస గృహాలున్న మచిలీపట్నం, నూజివీడు ప్రాంతాల్లో కూడా ఎసిబి అధికారులు ఏకకాలంలో తనిఖీలు జరిపారు.

గుడివాడ సిటివో రామారావును విచారిస్తున్న ఏసిబి అధికారులు