రాష్ట్రీయం

గోదావరి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూలై 2: సుప్రీంకోర్టు తీర్పు మేరకు గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో శనివారం ఆదిలాబాద్ జిల్లా బాసరలో ప్రవేశించిన గోదావరి జలకళతో ఉట్టిపడింది.
నిన్నమొన్నటి వరకు బాసరలో పుణ్యస్నానాలకు నోచుకోకుండా ఏడారిని తలపించిన గోదావరిలోకి మహారాష్ట్ర ఎగువ నుండి వచ్చిన వరద నీరు పరవళ్లు తొక్కుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు వైపు పరుగులు పెట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమ యంలో బాబ్లీ నుండి 18 కి.మీటర్లు ప్రవహిస్తూ బాసర గోదావరికి జలా లు చేరుకోగా బాసర నుండి 60 కి.మీటర్ల దూరంలో ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వరద నీరు చేరుకోవడంతో ఎస్సారెస్పీ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా బాబ్లీ గేట్లు వదలక ముందు 1046.60 అడుగుల (4.92 టిఎంసిలు) నీటి నిల్వ ఉంది. అయితే బాబ్లీ గేట్ల ద్వారా 0.31 టిఎంసిల నీటిని కిందికి వదలడంతో శనివారం సాయంత్రం వరకు 5 టిఎంసిల నీటి నిల్వతో 1047.60 అడుగులకు చేరుకుంది. దీంతో ఎస్సారెస్పీలోకి 4836 క్యూసెక్కుల నీరు చేరుకోవడంతో ప్రాజెక్టు రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకుంది.
బాసరలో భక్తుల పుణ్యస్నానాలు
నిన్న మొన్నటి వరకు వర్షాభావంతో ఏడారిని తలపించి బోసిపోయిన బాసర గోదావరి పుణ్యక్షేత్రం శనివారం బాబ్లీగేట్ల ద్వారా వదిలిన జలాలకు తోడు జిల్లాలో కురిసిన వర్షాలకు బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తింది. శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు భక్తిపారవశ్యంతో పుణ్యస్నానాలు ఆచరించారు.

చిత్రం.. బాసర వద్ద శనివారం పరవళ్లు తొక్కుతున్న గోదావరి