రాష్ట్రీయం

మా హైకోర్టు మాకు కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, జూలై 2: ‘మా హైకోర్టు మాకు కావాలి.. దాన్ని సాధించుకునే వరకు పోరాడుతాం. న్యాయమైన మా నాలుగు డిమాండ్లను సాధించుకునే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ఎంపీలు మా వెంటే ఉన్నారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ధ ధర్నా చేస్తాం. పార్లమెంటునైనా ముట్టడిస్తాం..’ అని రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు అన్నారు. హైకోర్టును వెంటనే విభజించాలని, న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయటంతో పాటు మరో రెండు ప్రధాన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఆధ్వర్యంలో శనివారం అసెంబ్లీ ముందున్న గన్‌పార్కు వద్ద న్యాయవాదులు వౌన దీక్షకు దిగారు. ఇదివరకెన్నడూ లేని విధంగా న్యాయవాదుల ఆందోళనకు మాజీ న్యాయమూర్తులు కూడా సంఘీభావం ప్రకటించారు. దీక్షకు ముందు రిటైర్డు జడ్జిలు భూపతిరెడ్డి, అరవింద్‌రెడ్డి, భూపాల్‌సింగ్, రామ్మోహన్‌రావు, బలరాంలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రలోని యువ అధికారులను తెలంగాణలో నియమించి, అక్కడి ఖాళీలను అలాగే పెట్టుకున్నారని ఆరోపించారు. అంతేగాక పదవీ విరమణకు దగ్గరగా ఉన్న తెలంగాణ న్యాయాధికారులను ఆంధ్రలో నియమించారని ఆరోపించారు. వారు పదవీవిరమణ చేసిన తరువాత మళ్లీ ఖాళీలేర్పడుతాయని వివరించారు. ఆంధ్ర జడ్జిలకు ఇచ్చిన ఆప్షన్‌తో వారు రెండు రాష్ట్రాల్లో లబ్ధి పొందే అవకాశముందని, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకసారి రాష్ట్రం విభజన జరిగితే, హైకోర్టును కూడా విభజించాల్సిందేనన్నారు. హైకోర్టు సిబ్బంది విభజన కోసం ప్రత్యేక కమిటీని నియమించి, తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని రిటైర్డు చీఫ్ జడ్జిని నియమించి, విధి విధానాలను రూపొందించి సమస్యలను పరిష్కరించాలని, ఇప్పటికే విధించిన సస్పెన్షన్‌ను బేషరుతుగా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను విలీనం చేసిన నాటి నుంచి న్యాయశాఖలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు ఆదివారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.
5 నుంచి జైల్ భరో
హైకోర్టు విభజన, న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేత తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 4న రాష్టవ్య్రాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ది ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. జితేందర్‌రెడ్డి వెల్లడించారు. దీంతోపాటు ఈ నెల 5వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు మూడు రోజుల పాటు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అలాగే 8వ తేదీన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన వెల్లడించారు.

చిత్రం.. గన్‌పార్క్ వద్ద శనివారం వౌనదీక్ష చేస్తున్న టి.న్యాయవాదులు