బిజినెస్

యువ శాస్తవ్రేత్తలకు ఫార్మా రిసెర్చ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ఔషధ రంగంలో వినూత్న పరిశోధనలు చేసిన ఐదుగురు యువ శాస్తవ్రేత్తలకు సిప్రా ఇన్నోవేటివ్ ఫార్మా రిసెర్చ్ అవార్డులను ప్రదానం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సనత్‌నగర్ (హైదరాబాద్)లోని సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైనె్సస్ డైరెక్టెర్ జావేద్ ఇక్బాల్ చేతులమీదుగా ఈ అవార్డులను శాస్తవ్రేత్తలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 96 పరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయి. ఇందులో ఐదు పరిశోధనాత్మక వ్యాసాలను ఎంపిక చేసి వాటిని రూపొందించిన శాస్తవ్రేత్తలకు అవార్డులను ఇచ్చినట్లు సత్యనారాయణ చెప్పారు. కాగా, రాజేష్ తిప్పరబోయిన, మిథున్ కుమార్ డి, ఉమేష్ డి లడ్డా, లక్ష్మీ భవాని, సర్వర్ బేగ్‌కు అవార్డులు వచ్చాయ. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ లంకా శ్రీనివాస్ పోలీస్ ఐజి లీగల్ ఇ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణతో అవార్డు గ్రహీతలు