రాష్ట్రీయం

ఇడి గుర్తించిన అక్రమాస్తులను సర్కారుకు అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 3: వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు సంబంధించి ఇడి గుర్తించిన అక్రమ ఆస్తులను ఆయన స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హితవు పలికారు. ఆదివారం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇడి గుర్తించిన జగన్ ఆస్తులన్నీ ప్రజల సొమ్మన్నారు. అందుకే ఆయన ఆ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడం ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రంలో ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్భ్రావృద్ధి నిరోధకుడిగా జగన్ తయారయ్యారని ధ్వజమెత్తారు. ఎక్కడైనా మనకు తెలిసినవారు ఒక ఇల్లు కట్టుకుంటే ఎంతో సంతోషిస్తామన్నారు. అలాంటిది రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానిని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే సహకరించాల్సిన జగన్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజధానికి శంకుస్థాపన చేసే సమయంలో తనను ఆహ్వానించడానికి ఎవ్వరూ రావద్దని చెప్పడమే జగన్ ఎంత అభివృద్ధి నిరోధకుడో తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన హితవు పలికారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని నారాయణ విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

చిత్రం.. మంత్రి నారాయణ