రాష్ట్రీయం

పేకాట ఆడుతూ పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 3: హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పక్కనే ఉన్న టూరిజం ప్లాజా హోటల్‌లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఓ మాజీ ఎమ్మెల్యే సహా ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. టూరిజం ప్లాజాలోని 508వ నెంబర్ గదిలో పేకాట శిబిరం కొనసాగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నానితో పాటు రమేశ్ యాదవ్, వెంకటరమణ, ఎస్‌కె.మహ్మద్, వెంకట్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. ఐదు లక్షల 75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.