రాష్ట్రీయం

మాజీ మావోల వద్ద ఆయుధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, జూలై 3: ప్రస్తుతం జనజీవన స్రవంతిలో బతుకుసాగిస్తున్న మాజీ మావోయస్టుల వద్ద ఆయుధాలు బయటపడ్డాయి. ఆయుధాలున్నాయన్న సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దివంగత నాయకుడు, న్యూడెమోక్రసీ అజ్ఞాతనేత రాయల సుభాష్ చంద్రబోస్ పనిచేసిన కాలంలో ఆయుధాలను తమ దగ్గర ఉంచుకున్న పలువురు వ్యక్తులు వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుబడ్డారని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఇల్లెందు సిఐ అల్లం నరేందర్, కారేపల్లి సిఐ జి రమేష్ మాట్లాడుతూ మాజీ నక్సలైట్లు ఆయుధాలను విక్రయించేందుకు సంచరిస్తున్నారనే సమాచారంతో బయ్యారం మండలం కాచనపల్లి గ్రామ సమీపంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని తెలిపారు. పాల్వంచ ప్రాంతంలోని ములకలపల్లి మండలానికి చెందిన మచ్చా వెంకన్న న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల్లో ఎనిమిదేళ్ళక్రితం పనిచేశాడు. ఆ క్రమంలోనే రాయల సుభాష్‌చంద్రబోస్ నుండి మూడు తుపాకులు తీసుకున్నారు.
అతనితోపాటు మరో ఇద్దరు వాటిని ఉపయోగించారు. జనజీవన స్రవంతిలో కలిసిన అనంతరం వేర్వేరు ప్రాంతాలలో వాటిని భద్రపరిచారు. సానుభూతిపరులైన ఖమ్మం అర్బన్ మల్లేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఐలయ్య వద్ద ఒక్కొక్క తుపాకీని ఉంచారు. మరో తుపాకీని తనవద్దనే ఉంచుకున్నాడు. ఆ మూడు తుపాకులను విక్రయించేందుకు సానుభూతిపరులతో కలిసి ప్రయత్నిస్తున్న క్రమంలోనే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. మచ్చావెంకన్న మాజీ నక్సలైటని ఐలయ్య, వెంకటేశ్వర్లు సానుభూతిపరులని ఆ ఇద్దరూ వెంకన్నకు సహకరిస్తున్నారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నక్సల్స్, మాజీనక్సలైట్ల కదలికపై నిఘా పెట్టడం వల్లే ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకోగలిగామని చెప్పారు.

చిత్రం.. పట్టుబడ్డ ఆయుధాలు, నిందితులతో పోలీసులు