ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ కడతాం ... చంద్రబాబు హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: పుష్కరాలను పురస్కరించుకుని రోడ్ల విస్తరణ కోసం తొలగించిన ఆలయాలను శాస్త్రోక్తంగా తిరిగి నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో దేవాలయాల తొలగింపుపై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో సిఎం సోమవారం స్వయంగా నగరంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై గుడులు ఎక్కడైనా తొలగించాల్సి వస్తే సంబంధిత మతపెద్దలతో ముందుగానే సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. పుష్కరాల పనులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని సిఎం ఆదేశించారు. పుష్కరాల కోసం మోడల్ గెస్ట్‌హౌస్‌లో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన సీతానగరంలో పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఘాట్లను పరిశీలించారు.