ఆంధ్రప్రదేశ్‌

ఇక్కడే అసెంబ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 4: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుండే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయ ప్రాంగణంలోని ఐదో బ్లాకులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లలో జరుగుతున్న అంతర్గత అలంకరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం కాలినడకన ఐదు భవనాలనూ పరిశీలిస్తూ షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తున్న 1వ బ్లాకులో తన కార్యాలయ అంతర్గత అలంకరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పుష్కరాలు ముగిసే ఆగస్టు నెలాఖరు నాటికి సచివాలయ భవన నిర్మాణ పనులు పూర్తయి, ఉద్యోగులందరూ ఇక్కడ కొలువు తీరతారన్నారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా సచివాలయంలో ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. భవనాలు నిర్మాణ దశలో ఉండగానే హైదరాబాదు నుండి తరలివచ్చిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
హైకోర్టు వివాదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తి..వాటిపై వివాదాలు సృష్టిస్తోందని అన్నారు. అన్నీ తమకే అనుకూలంగా ఉంటాయన్న ధోరణి సరైనది కాదన్నారు. ఇచ్చిపుచ్చుకునే విధానం విధంగా సామరస్య పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అన్ని వివాదాస్పద అంశాలపైనా పరస్పరం చర్చించుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. ఈ ప్రయత్నాలు విఫలమైతేనే కేంద్రం వద్దకు వెళ్లాలని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం సమక్షంలో కూర్చుని పరిష్కరించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటివాడినని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు సహకరించాలని కోరారు.

తాత్కాలిక సచివాలయంలో 5వ బ్లాకును
పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు