రాష్ట్రీయం

ఆందోళనకు ఫుల్‌స్టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: హైకోర్టు విభజన, తెలంగాణకు ఆంధ్ర న్యాయాధికారుల కేటాయింపు అంశాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయాధికారులు బుధవారం నుంచి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. న్యాయాధికారులు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన అంశంపై హైకోర్టు ఆగ్రహించి 11మంది న్యాయాధికారులను సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. ఆందోళన విరమించాలని సిజెఐ, హైకోర్టు తాత్కాలిక సిజె, గవర్నర్ ఇచ్చిన పిలుపును గౌరవించి విధుల్లో చేరాలని నిర్ణయించినట్లు తెలంగాణ జడ్జీల సంఘం ప్రకటనలో పేర్కొంది. సస్పెండ్ చేసిన 11మంది న్యాయాధికారులను తిరిగి సర్వీసులోకి తీసుకునే విషయమై ఉన్నత న్యాయస్ధానం ఇచ్చిన హామీపై తమకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. 11మంది న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వారు హైకోర్టును కోరారు.