రాష్ట్రీయం

సమీక్షతో దిద్దుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 7: తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సమీక్ష జరిపేందుకు పది మందితో ఒక కమిటీని వేయాలని పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఇందులో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, దేవినేని ఉమ, విప్ కాలువ శ్రీనివాసులు, వైవిబి రాజేంద్ర ప్రసాద్, జవహర్, మల్లిఖార్జున రెడ్డి, ఎంపి రామ్మోహనాయుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటి ప్రభుత్వ పాలనా తీరును అన్ని కోణాల్లో సమీక్షించి..లోపాలను వివరిస్తూ మార్గనిర్దేశన చేస్తూ పదిరోజుల్లో నివేదిక ఇస్తుంది. సమావేశ వివరాలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళావెంకటరావు విలేఖరులకు వివరించారు. రెండేళ్ల పాలనలో లోపాలను సరిచేసుకుంటూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పాలనా సమర్థతను మరింత పెంచుకోవాలని నిర్ణయించామని అన్నారు. గ్రామాల్లో అధికారులు, అనధికారులు సమన్వయంతో పనిచేసి, మరిన్ని ఫలితాలు రాబాట్టాలని చంద్రబాబు సూచించారని చెప్పారు. పార్టీ క్యాలెండర్‌ను 93 శాతం పూర్తి చేశామని. ఇంకా ఒక పద్ధతి ప్రకారం, మండల స్థాయిలో, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా సమన్వయ కమిటీ సమావేశల్లో కలుసుకుని క్యాలెండర్‌ను నూరు శాతం అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. వైకాపా తాజాగా చేపట్టిన ఇంటింటి కార్యక్రమాన్ని తాము పట్టించుకోవడం లేదన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఏవిధంగా ఫెయిల్ అయ్యాడో ప్రజలకు తెలుసునన్నారు.

చిత్రం.. గురువారం జరిగిన టిడిపి సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు