రాష్ట్రీయం

నేటి నుంచే పల్స్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 7: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రజా సాధికారిక సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) ప్రారంభం కానుంది. ఈనెలాఖరులోగా అంటే 22 రోజుల్లోగా ఈ సర్వేను రాష్టవ్య్రాప్తంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నివాస గృహం నుంచి ఈ సర్వేను శుక్రవారం ప్రారంభించనున్నారు. సర్వేలో వివరాలు ఇచ్చేందుకు సిఎం కుటుంబ సభ్యులంతా ఇప్పటికే ఉండవల్లిలోని సిఎం నివాస గృహానికి చేరుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ సర్వే చాలా కీలకమైనది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలన్న లక్ష్యంతో ఈ సర్వే నిర్వహిస్తోంది. ఏయే కులాలకు చెందిన వారు ఏయే స్థితిలో ఉన్నారని తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. అలాగే చాలా సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రతి వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సర్వేలో సేకరించనున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న వారి వివరాలను కూడా సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్యూమరేటర్లను నియమించారు. ప్రతి జిల్లాకు ఒక కో-ఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు ఇద్దరు ఐఎఎస్ అధికారులను కో-ఆర్డినేటర్లుగా నియమించింది. సర్వేపై ప్రజల్లో ఏమైనా అపోహలుంటే అధికారులు ముందుగానే వాటిని నివృత్తి చేస్తారు. సర్వేకు ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు ఇప్పటికే తమ వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు వంటి కార్డులను చూపించాల్సి ఉంది. ఒకవేళ ఆధార్ కార్డులో తప్పులు దొర్లితే, ఆ విషయాన్ని ఎన్యూమరేటర్ల దృష్టికి తీసుకువెళితే, వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రజల వివరాలను ఆల్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇప్పటికే సర్వేకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు అందచేసింది. 2జి, 3జి టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేస్తారు. 2జి, 3జి సిగ్నల్స్ లేని చోట మాత్రమే మాన్యువల్‌గా వివరాలు నిమోదు చేయాలని ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు సూచించింది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో ఎక్కడో ఒక చోట కూర్చుని వివరాలు సేకరిస్తే సరిపోదు. ఎన్యూమరేటర్ విధిగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలి. జియో ట్యాగింగ్ ద్వారా ఎన్యూమరేటర్ల కదలికలను కూడా జిల్లా కో-ఆర్డినేటర్లు పరిశీలించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు సంబంధించి 60 శాతం వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మరో 40 శాతం వివరాలు అందిందే పాలను మరింత సులభంగా చేయచ్చని ప్రభుత్వం భావిస్తోంది.