రాష్ట్రీయం

మొక్కకు మొక్కుదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నల్లగొండ, జూలై 7: దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. పరిపాలనలో కెసిఆర్‌ను దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఒక సర్వేలో దేశ ప్రజలు ఎంపిక చేశారు. ఇలా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం మరో రికార్డును సాధించే దిశగా అడుగులు వేస్తోంది. మొక్కలు నాటడంలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఒకేరోజు (శుక్రవారం) లక్షమంది పాల్గొని 163 కిలోమీటర్లు దారి పొడవునా మొక్కలు నాటబోతున్నారు. ఇందులోభాగంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే 25 లక్షల మొక్కలు నాటబోతున్నారు. ఒక సీజన్‌లో 46 కోట్ల మొక్కలను నాటబూనడం కూడా రికార్డే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం నల్లగొండ జిల్లాలో శ్రీకారం చుట్టబోతున్నారు. పాఠశాల విద్యార్థి మొదలుకుని గవర్నర్, ముఖ్యమంత్రి వరకు హరితహారంలో భాగస్వామ్యం అయ్యే విధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమం కొత్తేమీ కాకపోయినా దీనినో యజ్ఞంగా, ప్రజా ఉద్యమంగా కెసిఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేపట్టారు. ఒకేరోజు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో సిద్దిపేటలో 15 వేల మొక్కలను నాటించి అప్పట్లో కెసిఆర్ ప్రశంసలు అందుకున్నారు. హరితహారం కార్యక్రమానికి నిరుడే శ్రీకారం చుట్టినప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు.రాష్ట్రంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. ‘కోతలు అడవికి వాపస్ పోవాలి, వానలు వాపస్ రావాలి’ నినాదంతో హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాదికి కావాల్సిన 46 కోట్ల మొక్కలను పెంచేందుకు నిరుడు 3500 నర్సరీలను, ఈ ఏడాది 4213 నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పాటు ఔషధ మొక్కలను కూడా పెంచింది. ఇలాఉండగా శుక్రవారం నిర్వహించనున్న హరితహారం కార్యక్రమాన్ని హెలిక్యాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేయనున్నారు.

మొక్క నాటుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ (ఫైల్ ఫొటో)