రాష్ట్రీయం

ఎన్‌ఐఎ వలలో మరో ముష్కరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన మరో ఐఎస్‌ఐఎస్ అనుమానితుడిని నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సంతోష్‌నగర్‌లోని ఈద్ బజార్‌కు చెందిన నిజాముద్దీన్ పేలుళ్లకు కుట్రపన్నిన ఐదుగురికి సహకరించారనే అభియోగంతో ఎన్‌ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీం సిమ్‌కార్డులు, మొబైల్‌ఫోన్లను తెలిసినవారి పేర్లమీద కొనుగోలు చేశాడు. దీనికి నిజాముద్దీన్ సహకరించినట్లు అభియోగం. ఇబ్రహీం యజ్దానీ కొంతకాలం దుబాయ్‌లోనూ ఉండి వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఇదిలా ఉండగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎన్‌ఏఐ పోలీసుల నుంచి కీలక సమాచారాన్ని తీసుకునేందుకు వచ్చారు. తాజా అరెస్టుతో దేశంలో ఐఎస్‌ఐఎస్‌తో అనుబంధం ఉండి జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతూ అరెస్టయిన వారి సంఖ్య 60కు చేరింది. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్‌ల విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. వీరికి గతంలో వివిధ ఉగ్రవాద కార్యకలాపాల కింద అరెస్టయి జైళ్లలో ఉన్న వారితో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిరియా, ఇరాక్ ఉగ్రవాదానికి ఆకర్షితులై వెళ్లిన వారిలో ఆరుగురు భారతీయులు ఆ దేశాల్లో వివిధ ఘటనల్లో మరణించారు. ఇంతవరకు భారత్‌కు చెందిన 23మంది యువకులు సిరియాకు వెళ్లారు. ఇందులో ఇద్దరే ఉగ్రవాదం పట్ల విముఖత చెంది దేశానికి తిరిగి వచ్చారు.
చర్లపల్లి, చంచల్‌గూడలో భద్రత పెంపు
ఎన్‌ఐఏ పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాద అనుమానితులను చర్లపల్లి లేదా చంచల్‌గూడ జైళ్లకు పోలీసు కస్టడీ తర్వాత తరలించేందుకు పోలీసులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ జైళ్లలో భద్రత పెంచారు. చంచల్‌గూడ జైల్లో ఇప్పటికే ముగ్గురు ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులున్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న యాసిన్ భత్కల్ చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఈ రెండు జైళ్లలో విచారణ ఖైదీలుగా ఉన్న ఉగ్రవాద అనుమానితులు అడపాదడపా జైలు సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. గతంలో జైలర్ హనుమాన్ ప్రసాద్, శ్రీ్ధర్, శ్రీనివాసరెడ్డి అనే ఉద్యోగులపై ఉగ్రవాద అనుమానితులు దాడులు చేసి గాయపరిచారు. చర్లపల్లి జైల్లో 2వేల మంది ఖైదీలున్నారు. కానీ భద్రతా సిబ్బంది 220 మందే ఉన్నారు.