రాష్ట్రీయం

రంగంలోకి లోకాయుక్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: సరోజినీ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు వికటించి పలువురు చూపు కోల్పోయిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సుమోటోగా స్పందించి కేసుపై విచారణ ప్రారంభించాయి. లోకాయుక్త ఆదేశాలతో ఒక ప్రతినిధి బృందం శుక్రవారం ఆస్పత్రిని సందర్శించింది. వైద్యులు, బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. బాధితులు ఎప్పుడు అసుపత్రిలో చేరారు? అప్పటి నుంచి వారికి అందించిన చికిత్స వివరాలు, ఆపరేషన్లు వికటించిన వైనంపై బాధితులు, వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. కంటి చూపు బాగుకోసం వస్తే, ఉన్న చూపును వైద్యులే పోగొట్టారని రోగుల బంధువులు లోకాయుక్త బృందం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, సుమోటోగా కేసు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉదంతంపై 21లోగా వివరణ ఇవ్వాలంటూ సిఎస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరిండెంట్‌లకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే విచారణ కమిటీని నియమించింది.
ఇదిలావుంటే, డ్రగ్స్ కంట్రోల్ విభాగం ప్రభుత్వాసుపత్రుల్లో సెలైన్లను పరిశీలించింది. కంటి చూపు పోవడానికి కారణమైన సెలైన్లు తయారు చేసిన హబీబ్ ఫార్మా కంపెనీపై ఇప్పటికే నిషేధం విధించారు. ఈ ఫార్మా కంపెనీ అందించిన సెలైన్లలోనే వైరస్ ఉందని తేలింది. దీంతో సరోజినీ దేవి కంటి ఆస్పత్రితోపాటు ప్రభుత్వ అస్పత్రులు అన్నింటిలో డ్రగ్ కంట్రోల్ సిబ్బంది దాడులు జరిపి, సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాసుపత్రులకు సెలైన్ బాటిళ్లను సరఫరా చేస్తున్న హబీబ్ ఫార్మా, ఒక్క సరోజినీదేవి ఆస్పత్రికే 20వేల వరకూ సెలైన్లను పంపిణీ చేసింది. సరోజినీదేవి ఆస్పత్రికి హబీబ్ ఫార్మా పంపిణీ చేసిన ఆర్‌ఎల్ సొల్యూషన్‌లో వైరస్ ఉందని తేలడంతో, కంపెనీని తనిఖీ చేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ మహారాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థకు లేఖ రాసింది. కంపెనీ ఇప్పటి వరకు ఏయే ప్రాంతాలకు ఆర్‌ఎల్ సొల్యూషన్ పంపిణీ చేశారో అక్కడ వాటి తనిఖీలు చేస్తున్నారు. కంటి చూపు పోవడానికి కారణమని భావిస్తున్న ఆర్‌ఎల్ సెలైన్ బాటిళ్ల బ్యాచ్‌నుంచి 48 బాటిళ్లను ఔషధ నియంత్రణ శాఖ స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం స్టేట్ లాబోరేటరీకి పంపించారు. ఆపరేషన్ సమయంలో కంటికి ఆర్‌ఎల్ సొల్యూషన్ ఉపయోగిస్తారు. ఈ సొల్యూషనే వైరస్‌గామారి కంటిచూపు పోవడానికి కారణమైంది. బాటిళ్లలో కనిపించిన వైరస్సే, బాధితుల కళ్లలోనూ కనిపించటంతో ఈ విషయాన్ని నిర్థారించారు. 13మంది బాధితుల్లో ఐదుగురిని ఇన్‌పెషెంట్‌గా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, వీరిలో ఇన్‌ఫెక్షన్ క్రమంగా తగ్గుతోందని సరోజినీ ఆస్పత్రి డిప్యూటీ సూపరిండెంట్ రాజేందర్ గుప్తా తెలిపారు. వైరస్ నిర్మూలనకు అవసరమైన యాంటీ బయోటిక్స్ ఉపయోగిస్తూ చికిత్స అందిస్తున్నామన్నారు. కంటిచూపు పోయిన ఘటనలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాతే బాధ్యులపై చర్య తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
నిలోఫర్ ఆసుపత్రిలోనూ..
చిన్నపిల్లల ఆసుప్రతి నిలోఫర్‌లో రెండురోజుల క్రితం సెలైన్‌లో బ్యాక్టీరియా ఉన్నట్టు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే! అంతేగాక, ఆస్పత్రిలోని సుమారు 29వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేసిన అధికారులు, వీటిలో కొన్నింటిని పరీక్షల నిమిత్తం నాగ్‌పూర్‌కు పంపారు. దీంతో శుక్రవారం అవసరాల నిమిత్తం ఆసుపత్రి వైద్యులు బయటినుంచి 1200 సెలైన్ బాటిళ్లను కొనుగోలు చేశారు.