రాష్ట్రీయం

కదులుతున్న డొంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9 : హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి(ఎస్‌డిఇ) దవాఖానాలో 13 మందికి జరిగిన కంటి ఆపరేషన్లు వికటించిన సంఘటనపై లోకాయుక్త సోమవారం నుంచి విచారణ జరుపుతుంది. మరోవైపు ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు కూడా తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంకోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది. నివేదికను ఆదివారం ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆస్పత్రిలో ఉన్న రెండు బ్యాచ్‌లకు చెందిన ఆర్‌ఎల్ బాటిల్స్‌లో క్లెబ్తిల్లా, న్యూమోనియా బ్యాక్టీరియా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సీసాలను మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారు.
ఎస్‌డిఇ దవాఖానా ఆపరేషన్ థియేటర్-2 లో జూన్ 30 న 13 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించగా ఆపరేషన్ జరిగిన కంటికి ఇన్‌ఫెక్షన్ సోకింది. జరిగిన ఘోరం వెలుగులోకి రాగానే డాక్టర్లు హుటాహుటిన చికిత్స చేయగా ఏడుగురు రెండురోజుల్లో కోలుకున్నారు. మిగతా వారికి చికిత్స జరుగుతోంది. ఈ అంశంపై లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి శనివారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, మీడియాలో వచ్చిన వార్తలను పరిశీలించిన తర్వాత ‘సూమోటో’గా ఈ కేసును స్వీకరించానని, ఎస్‌డిఇ దవాఖానాకు వెళ్లి, రోగులు, వైద్యులతో మాట్లాడానన్నారు. తన అధీనంలోని డైరెక్టర్ ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌కు ఆదేశాలు జారీ చేస్తూ, సమగ్ర విచారణ జరిపి సోమవారం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించానని చెప్పారు.
కాగా, హుమాయూన్‌నగర్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సరోజిని దేవి ఆసుపత్రికి చెందిన కొందరు డాక్టర్లపై ఐపిసి 338కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఈ కేసును వైద్యకోణంలో దర్యాప్తు చేసేందుకు తెలంగాణ వైద్య శాఖ సహాయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
పోలీసు కేసు తప్పు: డాక్టర్ల సంఘం
ఇదిలా ఉండగా 13 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్లది ఎలాంటి తప్పు లేదని ఎస్‌డిఇ డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఈ సంఘం ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడుతూ, తమపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం సరైన విధానం కాదన్నారు. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రజలు నిర్భయంగా రావాలని, కంటి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బాక్టీరియా ఉన్న సెలైన్ బాటిల్స్‌ను సరఫరా చేసిన సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. డాక్టర్ల నైతికత దెబ్బతినే విధంగా వ్యవహరించరాదన్నారు. కాటరాక్ట్ ఆపరేషన్ సమయంలో కంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించిన రింగర్ లాక్టేట్ (ఆర్‌ఎల్) ద్రావణంలో బాక్టీరియా ఏర్పడటం వల్లనే ఆపరేషన్ అయిన వారి కంటికి ఇన్‌ఫెక్షన్ సోకిందన్నారు. ఈ ఆసుపత్రిలో వేల మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతుంటాయని, డాక్టర్లది తప్పుంటే తరచూ ఇలాంటి కేసులు వస్తూనే ఉండాలని వివరించారు. రింగర్ లాక్టేట్ ద్రావణంలో క్లెప్సిల్లా బాక్టీరియా ఏర్పడటం వల్లనే ప్రమాదం ఏర్పడ్డదన్నారు. ద్రావణాన్ని సరఫరా చేసిన హసీబ్ కంపెనీపై కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మందును కొనుగోలు చేసిన తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ది తప్పు ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. ఈ సంస్థను రద్దు చేసే అంశం కూడా ప్రభుత్వం పరిశీలించాలన్నారు. పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ట్రీట్‌మెంట్‌కోసం ఎల్‌వి సహకారం
రోగుల కళ్లకు సోకిన ఇనె్ఫక్షన్‌ను తగ్గించేందుకు ఇప్పటికే చికిత్స చేస్తున్నామని, ప్రైవేట్‌లోని ప్రముఖ కంటి ఆసుపత్రి నిపుణులు సలహాలను కూడా తీసుకున్నామని ఎస్‌డిఇ దవాఖానా ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రగుప్తా తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో నిపుణుల సలహా మేరకు ఆంటిబయాటిక్స్ ఇస్తున్నామన్నారు. ఐదుగురిలో నూకాలమ్మ అనే పేషంట్‌కు కార్నియా ఆపరేషన్ చేశామన్నారు. మిగతావారికి చికిత్స అందిస్తున్నామని, అవసరమైతే ఐబ్యాంకుల సహకారం కూడా తీసుకుని ఇన్‌ఫెక్షన్ అయిన వారికి చూపు తిరిగి వచ్చేలా చూస్తామని రాజేంద్రగుప్తా ఇచ్చారు.
కాగా తాము రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి 1.75 లక్షలకుపైగా సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారి అమృతరావు చెప్పారు. నాగ్‌పూర్‌కు చెందిన ఒక కంపెనీ ఈ సెలైన్ బాటిళ్లను తయారు చేసిందన్నారు. ఈ బాటిళ్లను ల్యాబ్‌పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. నివేదిక రావాలంటే 14 రోజులు పడుతుందన్నారు. రాష్ట్రంలో రోగులకు అవస్ధలు కలగకుండా అహమ్మదాబాద్‌కు చెందిన మందుల సంస్థ నుంచి పెద్ద ఎత్తున సెలైన్ బాటిళ్లకు ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. సరోజిని దేవి ఆసుపత్రి ఘటనపై సెలైన్ బాటిళ్లలో వైరస్ ఉందా లేక డాక్టర్లు నిర్దేశించిన ప్రోసీడింగ్స్‌ను పాటించలేదా, లేదా నిర్లక్ష్యమా ఎవరిది తప్పు అనే అంశంపై విచారణ సాగుతోందన్నారు.

చిత్రాలు.. శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న సరోజినీదేవి కంటి ఆస్పత్రి వైద్యులు.
కంటి చూపు పోయ ఆస్పత్రిలో చికిత్స చేయంచుకుంటున్న మహిళ