రాష్ట్రీయం

లెక్కలు చెప్పని స్వతంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుకు సంబంధించి వివరాలు ఇవ్వని స్వతంత్ర అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన, ఆంధ్ర, తెలంగాణకు చెందిన 289 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల వ్యయంపై నివేదికలు వెంటనే ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెండేళ్లు గడచినా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థులు ఖర్చుపై నివేదికలు ఇవ్వలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి ఈ నోటీసులు జారీ చేశారు. ఒక వేళ స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన వివరణ, నివేదికపై సంతృప్తి చెందని పక్షంలో ఎన్నికల్లో ఎనిమిది సంవత్సరాల పాటు పోటీ చేయకుండా ఎన్నికల సంఘం వేటు వేసేందుకు చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. వేటు పడితే 2014 నుంచి అమలులోకి వస్తుంది. తెలంగాణలో పోటీ చేసిన 171 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆంధ్రలో పోటీ చేసిన 118 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇంతవరకు ఎన్నికల వ్యయంపై వివరాలను ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేయలేదు. ఇందులో పార్లమెంటు స్థానాలకు కూడా పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 38 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. ఇందులో 11 మంది ఎంపి అభ్యర్థులు, 27 మంది అసెంబ్లీకి పోటీచేసిన అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాలో 31 మంది అభ్యర్థులు ఎన్నికల వ్యయం వివరాలను సమర్పించలేదు. వీరితో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో 15 మంది, కర్నూలు జిల్లాలో 13 మంది, కృష్ణా జిల్లాలో 12 మంది, కడప జిల్లాలో 12 మందికి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల్లో కొంత మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు ఎన్నికల సంఘానికి చాలా సంవత్సరాలుగా ఫిర్యాదులందుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు పరిమితికి లోబడి నిర్ణీత సంఖ్యలో వాహనాలను ప్రచారానికి వాడుకోవచ్చని నిబంధన ఉంది. కౌంటింగ్, పోలింగ్ సెంటర్లలో ఏజెంట్లను నియమించుకోవచ్చు. కొంత మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఈ సదుపాయాలను ప్రధాన రాజకీయ పార్టీలకు బదలాయిస్తారు. పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఒకరిద్దరిని పోటీకి నిలబెడుతాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు డిపాజిట్లను కూడా రాజకీయ పార్టీలే చెల్లిస్తాయి. అలాగే ప్రలోభాలకు కూడా గురి చేస్తాయి. నాన్ సీరియస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల వల్ల ఎన్నికల వ్యవస్థ జటిలమవుతోంది. ఎన్నికల వ్యయం వివరాలు సకాలంలో అందించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.