తెలంగాణ

నారాయణ్‌పేట్-కొడంగల్ ప్రాజెక్టు కోసం సంఘటిత ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, జూలై 10: మహబూబ్‌నగర్ జిల్లాలోని అత్యధిక ప్రాంతాలకు నీరు అందించే నారాయణ్‌పేట్- కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కలిసి ఉద్యమించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు నిర్ణయించారు. ఆదివారం నారాయణ్‌పేట్-కొడంగల్ జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జలసాధన సమితి అధ్యక్షుడు అనంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు పాలమూరు జిల్లాను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యం చేయడం దారుణమని విమర్శించారు. రాజకీయ కారణాలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయడం సమంజసం కాదని అన్నారు. నాడు ఆంధ్ర కాంటాక్టర్లు అంటూ నిందించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం వారికే నిర్మాణ బాధ్యతలను అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు.
సిఎంను కలవడం వల్ల ప్రయోజనం లేదు
జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రాజెక్టు డిజైన్ మార్చింది కేవలం కమిషన్ల కోసమేనని దుయ్యబట్టారు. ‘ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రిని కలవడం వల్ల ఉపయోగం లేదు..కెసిఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తారు..ప్రజాస్వామ్య విలువలు ఆయన వ్యక్తిత్వంలో లేవు..గతంలో ఈ మూడు ప్రాంతాలకే ఎంపిగా కేసిఆర్ ఉన్న విషయాన్ని సైతం మరిచిపోయారు..ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు..పార్టీలు మారిన ఎమ్మెల్యేలు..ముఖ్యమంత్రి చేతులో, కాళ్లో పట్టుకొని ఈ ప్రాజెక్టుకు ఒప్పిస్తే పార్టీ మారిన వారిని ప్రజలు క్షమిస్తారు..’ అని జైపాల్‌రెడ్డి అన్నారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రసంగిస్తూ పక్షపాతం లేకుండా పాలకులు పరిపాలించాలి, ఒకే ప్రాంతానికే ముఖ్యమంత్రిలా వ్యవహరించడం సరి కాదని అన్నారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ప్రాజెక్టులు రావడానికి జలసాధన సమితుల ఉద్యమాల ద్వారానే అన్న విషయాలను మరవరాదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సక్రమంగా అమలై ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదని ఆయన తెలిపారు. జూరాల నుంచి కావాల్సిన నీరు తీసుకోవాల్సిందే, ఒర్జినల్ డిజైన్ ప్రకారం నిర్మించడంతో నారాయణ్‌పేట్, కొడంగల్ ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని చాలా ప్రాంతాలకు నీరు అందే అవకాశం ఉంటుందని, ఈ విషయంపై జిల్లా జెఎసితో సమగ్రంగా చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. మాజీ మంత్రి డికె అరుణ ప్రసంగిస్తూ దిండికి ఇక్కడి నుంచి నీరు తీసుకువెళ్లడాన్ని వ్యితిరేకిస్తున్నామని అన్నారు. బిజెపి నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అయ్యేవాటిని పక్కన బెట్టి ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్టులను నిర్మించాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఒక ప్రభంజనంలా ప్రాజెక్టు కోసం ఉద్యమించాలని అన్నారు.
కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి