తెలంగాణ

మహారాష్టత్రో మరో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూలై 10: గోదావరిపై నిర్మించబోయే నీటిపారుదల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో మరో ఒప్పందం కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 15న ముంబాయి వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివీస్‌తో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భేటీ కావాల్సి ఉండగా, ఈ కార్యక్రమం మూడవ వారానికి వాయిదా పడినట్టు అధికార వర్గాల సమాచారం. గోదావరిపై నిర్మించబోయే రీ-డిజైనింగ్ చేసిన ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా రూపొందిస్తున్న ఒప్పంద పత్రాల తయారీని పకడ్బంధిగా రూపొందించే పని పూర్తి కాకపోవడం వల్లనే మరో వారం రోజుల పాటు ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య జరిగాల్సిన భేటీ వాయిదా పడటానికి కారణమని తెలిసింది. మహారాష్టత్రో కుదుర్చుకోబోయే ఒప్పందాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఎజండా ఖరారు చేసింది. ప్రధానంగా వీరి భేటీలో లోయర్ పెన్‌గంగాపై నిర్మించబోయే చనాక- కొరాట బ్యారేజి, తమ్మిడిహట్టి బ్యారేజిపై ఇరు రాష్ట్రాలు దాదాపు ఏకాభిప్రాయంతోనే ఉన్నట్టు తెలిసింది. ఈ రెండు ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని తెలిసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించబోయే బ్యారేజి ఎత్తుపైనే మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి ఎత్తు 100 మీటర్ల వరకు ఉంటే తమకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుండగా, మరో మీటర్ ఎత్తు ఎక్కువ ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మేడిగడ్డ బ్యారేజి ఎత్తు అంశమే ప్రధానం కానుందని అధికార వర్గాల సమాచారం. గత మార్చి 8న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కెసిఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో గోదావరి జలాల పంపిణిపై అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే మండలి పరిధిలో అఫెక్స్ కమిటీ ఏర్పాటు చేసి అందులో ఇరు రాష్ట్రాల సిఎంలు, నీటిపారుదలశాఖ మంత్రులు సభ్యులుగా ఉండాలని మార్చిలో జరిగిన భేటీలో నిర్ణయించారు.
అలాగే ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై జరిగిన పురోగతిపై ముఖ్యమంత్రి భేటీలో చర్చించనున్నారని తెలిసింది.