రాష్ట్రీయం

మంత్రి ఉంటే నాకేంటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 11: అది కర్నూలు సర్వజన వైద్యశాల. వైద్యఆరోగ్యశాఖ మంత్రి కానినేని శ్రీనివాస్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. చుట్టూ భారీ పోలీసు బందోబస్తు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్న వేళ.. అయినా నాకేం భయం అంటూ ఓ పాత దొంగ యథావిధిగా చేతికి పని చెప్పాడు. ఒకసారి చోరీ చేసి పారిపోయిన వాడు, ఆశచావక మరోసారి చోరీకి వచ్చి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం రాత్రి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో రాత్రి నిద్ర చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. నిత్యం ఆసుపత్రిలో చోరీలకు పాల్పడే పాత దొంగ మురళీ మనోహర్ ఎలాంటి జంకులేకుండా ఆసుపత్రిలోకి ప్రవేశించాడు.
నిద్రిస్తున్న రోగులు, ఆసుపత్రి సిబ్బందికి చెందిన ఐదు ఎటిఎం కార్డులు చోరీ చేశాడు. అంతటితో సంతృప్తి చెందకుండా రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్యురాలి విశ్రాంతి గదిలోకి వెళ్లాడు. అప్పుడే వార్డు నుంచి తిరిగి వచ్చిన ఆమె ముఖం కడుక్కునేందుకు బాత్‌రూంలోకి వెళ్తూ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి టేబుల్‌పై పెట్టింది. ఆ గొలుసుని అమాంతం జేబులో వేసుకున్న దొంగ వెళ్తూవెళ్తూ వైద్యురాలి కోటు జేబులో ఉన్న సెల్‌ఫోన్ చోరీకి యత్నిస్తుండగా అది కాస్త కింద పడి శబ్దమైంది. దీంతో అప్రమత్తమైన వైద్యురాలు దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేసింది. అప్పటికీ ఆ దొంగ ఎవ్వరికి దొరక్కుండా చల్లగా జారుకున్నాడు.
పోలీసులకు విషయం తెలిపిన వైద్యురాలు దొంగ ఆనవాళ్లు వివరించింది. అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది దొంగ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. అయితే పారిపోయిన దొంగ దగ్గర్లోని ఎటిఎంల వద్దకు వెళ్లి దొంగిలించిన ఎటిఎం కార్డుల ద్వారా నగదు డ్రా చేసే ప్రయత్నం చేశాడు. పిన్ నెంబర్ సరిపోకపోవడంతో డబ్బు రాలేదు. దీంతో ఆశచావని అతగాడు మళ్లీ తెల్లవారుజామున ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. ఓ రోగి వద్ద చోరీ చేస్తూ విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కంటపడ్డాడు. వెంటనే పోలీసుల సహాయంతో దొంగను పట్టుకున్న వారు జేబులు వెతకగా వైద్యురాలికి చెందిన బంగారు గొలుసు, ఎటిఎం కార్డులు, ఎంటిఎం స్లిప్పులు లభించాయి. దొంగను మూడవ పట్టణ పోలీసుస్టేషనుకు తరలించి విచారిస్తున్నారు.