రాష్ట్రీయం

తెలుగు యాత్రికులు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/నెల్లూరు/నిజామాబాద్: అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళి అక్కడ చిక్కుల్లో పడిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు స్వస్థలాలకు తిరుగు పయనం కాగా, నిజామాబాద్‌కు చెందిన కొంతమంది ఆర్మీ క్యాంపుల్లో తల దాచుకుంటున్నారు. యాత్రికులకు ఇబ్బంది ఏమీ లేదని, క్షేమంగా తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
79 బస్సులకు రక్షణ
శ్రీనగర్‌లో సుమారు 500మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారుల అంచనా. భద్రతా అధికారులు అంగీకరిస్తే వారిని జమ్మూకు తరలించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తగిన భద్రత లేకుండా యాత్రికులను అక్కడి నుంచి తరలించవద్దని ప్రధానమంత్రి కార్యాలయం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా అక్కడ చిక్కుకుపోయిన వారికి భద్రత, ఆహార ఏర్పాట్లు చేస్తామని, వారి బంధుమిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎపి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఎవి రాజవౌళి తెలిపారు. తాను జమ్మూ-కాశ్మీర్ సిఎం కార్యాలయం ప్రిన్సిపల్ కార్యదర్శితో మాట్లాడానని, మీడియాలో వచ్చే కథనాలు చూసి కంగారు పడవద్దని ఆయన యాత్రికుల బంధువులకు విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్, జమ్మూ-కాశ్మీర్ మధ్య జవహర్ టనె్నల్ దాటేందుకు యాత్రికులు ప్రయాణించే 79 బస్సులకు రక్షణ కల్పించినట్లు సిఆర్‌పిఎఫ్ సెహల్‌గావ్ కమాండెంట్ రాజ్‌కుమార్ చెప్పినట్లు ఆయన తెలిపారు.
అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన నిజామాబాద్‌కు చెందిన సుమారు 250 మంది ప్రస్తుతం ఆర్మీ క్యాంపులో క్షేమంగా ఉన్నట్లు సమాచారం. మెదక్ జిల్లా సిద్దిపేటవాసులు బల్తాల్‌లోని ఉచిత అన్నదాన ట్రస్టులో తలదాచుకున్నారు. సోమవారం రాత్రి వారిని జమ్మూకు తరలించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన 47 మంది అమర్‌నాథ్ యాత్రికుల్లో 27 మంది ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేరుకున్నారు. మిగతా వారు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నట్లు సమాచారం. బుధవారం వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఎపి భవన్ అధికారులు చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌చందర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ (08572-240500)ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
కాశ్మీర్‌లో చిక్కుకున్న 400 మంది యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేశామని ఎపి హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామం నుంచి యాత్రకు వెళ్ళిన యాత్రికులు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.