రాష్ట్రీయం

విశాఖపై ఉగ్రకన్ను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: ఉగ్రవాదుల దృష్టి ఇప్పుడు విశాఖ నగరంపై పడిందా? అవునంటోంది ఇంటిలిజెన్స్ విభాగం. ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులు విశాఖపై జరగవచ్చని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), జైషే మొహమ్మద్ (జెఇఎం), ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు విశాఖపై గురిపెట్టినట్టు ఇంటిలిజెన్స్ నివేదిక చెపుతోంది. శ్రీలంకలో ఇటీవల ఐఎస్‌ఐఎస్ ఏజెంట్లను అరెస్ట్ చేసి, వారిని విచారిస్తున్నప్పుడు ఉగ్రవాదులు విశాఖను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటిలిజెన్స్ అధికారులు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉంది. తీర భద్రతతో నౌకాదళం నిరంతరం అప్రమత్తంగానే ఉంటోంది. తూర్పు నౌకాదళం కేంద్రంగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఎప్పుడూ అక్కడే లంగరు వేసి ఉంటాయి. దీన్ని ఆనుకునే పోర్టు, హార్బర్ ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్, ఎన్‌టిపిసి ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు నౌకాదళ స్థావరాలను టార్గెట్‌గా చేసుకున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
విశాఖకు సముద్ర జలాల్లోకి శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు అవకాశాలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్లీపర్ సెల్స్ విశాఖలో సంచరిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక పంపించారు. విశాఖలో భద్రతా పరంగా కొన్ని లోపాలున్నాయి. వాటిని సవరించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. అలాగే షాపింగ్ మాల్స్, జన సమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో భద్రత, నిఘాను ముమ్మరం చేయాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఆ నివేదికలో సూచించినట్లు తెలిసింది.