రాష్ట్రీయం

మనం... సహజ మిత్రులం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: సహజవనరుల వినియోగంలోనూ, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ అగ్రభాగాన ఉన్న రష్యాతో ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేయాలన్న ధృడ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఇన్నోప్రోమ్-2016 వేదికపై చంద్రబాబు కీలక ఉపన్యాసం ఇచ్చారు. రష్యా, భారత్‌లకు దశాబ్దాల బంధం ఉందని, ఉభయ దేశాలు సహజమిత్రులని చంద్రబాబు అభివర్ణించారు. రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాల అవసరాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారని, భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని, ప్రస్తుతం 7.6 శాతం వృద్ధి రేటు త్వరలో రెండంకెల పురోగతిని అందుకుంటుందని అన్నారు. సహజ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో రష్యాతో కలిసి పనిచేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు వారి యాజమాన్యంలో ఉన్న రెడ్డి ల్యాబ్స్ రష్యాలో ఫార్మా ల్యాబ్ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతి నిర్మాణంలో రష్యా భాగస్వామ్యం కావాలని సూచించారు. విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రెండేళ్ల శిశువుగా మారిందని, ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు. రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు, వాణిజ్యమంత్రి డెనిస్ మాంచురోవ్ మాట్లాడుతూ భారత్ విదేశీ పెట్టుబడులను అనుమతించడాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. తొలుత ఆయన ఇన్నోప్రోమ్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, వసుంధర రాజే పాల్గొన్నారు.

చిత్రం.. ఇన్నోప్రోమ్-2016 సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలతో సిఎం చంద్రబాబు