రాష్ట్రీయం

బాబుకు 13వ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: కేసీఆర్ నెంబర్ వన్.. శివరాజ్‌సింగ్ చౌహాన్ నెంబర్ టూ.. రమణసింగ్ నెంబర్ త్రీ.. ఆనంది బెన్ నెంబర్ ఫోర్.. అరవింద్ కేజ్రీవాల్ నెంబర్ ఫైవ్! ఈ నెంబర్లేమిటని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రధాని నిర్వహించిన సర్వేలో వచ్చిన స్థానాలివి! అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ ప్రతి మూడు నెలలకోసారి త్రైమాసిక నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ నిఘా సంస్థలతోపాటు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కూడా ఈ సర్వేలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో సంతృప్తస్థాయి ప్రాతిపదికన ఈ సర్వే నివేదికలు ఇస్తారని చెబుతున్నారు. ఆ ప్రకారం తాజా త్రైమాసిక సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ప్రజాభిమానం సంపాదించుకున్న ముఖ్యమంత్రుల్లో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్ధానం సాధించగా.. ఆయనకంటే సీనియర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 13వ స్థానంలో ఉన్నట్టు సమాచారం. బిజెపి పాలిత ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్ మొదటి స్థానంలో ఉండటం మరో విశేషం.
బిజెపిని వ్యతిరేస్తూ, తరచూ మీడియాకెక్కుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఐదవ స్థానం లభించడం ప్రస్తావనార్హం. బిజెపి సీఎం వసుంధరరాజే సింధియాకు 7వ స్థానం, జార్ఖండ్ బిజెపి ముఖ్యమంత్రి రఘువర్‌ప్రసాద్‌కు 14వ స్థానం లభించాయి. ఈనెల 16న ర్యాంకులపై అధికార ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.