రాష్ట్రీయం

చెలబిన్స్ ప్రావిన్స్‌తో చెట్టపట్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రష్యాలోని చెలబిన్స్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రష్యా పర్యటనలో భాగంగా చంద్రబాబు చెలబిన్స్ గవర్నర్ బోరిస్‌తో సమావేశమయ్యారు. ఇరు ప్రాంతాల పక్షాన చెరో ఐదుగురు సభ్యులతో త్వరలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.వచ్చే మార్చిలో భారత్ పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు కార్యరూపం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎపి ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చెలబిన్స్ ప్రావిన్స్‌కు అందజేస్తామని సిఎం హామీ ఇచ్చారు. అలాగే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి మాస్కో సహకారాన్ని అందించేందుకు అంగీకరించింది. మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విధాన విభాగాధిపతి ఓలెగ్ బొచరోవ్‌తో కూడా చంద్రబాబు సమావేశం అయ్యారు. రాజధాని భవనాల నిర్మాణంలో తాము సహకరిస్తామని బొచరోవ్ హామీ ఇచ్చారు. అనంతరం గాజ్ ప్రొమ్ బ్యాంకు ఫస్టు వైస్ ప్రెసిడెంట్ యాంట్ సెంటర్‌తో సమావేశం అయ్యారు. భారత్ మార్కెట్‌లో ప్రవేశించడానికి గాజ్ ప్రొమ్ బ్యాంకు ఆసక్తిని చూపింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వెర్డ్‌లోవ్క్స్ గవర్నర్ ఎవిజనీ కుయివషెవ్‌తో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి పనితీరును ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తాను తెలుసుకున్నానని , పరిపాలనలో చంద్రబాబు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. త్వరలో ఎపికి తమ బృందాన్ని పంపిస్తామని సెర్డ్‌లోవ్స్క్ గవర్నర్ ఎవిజనీ కుయివషెవ్ చెప్పారు.
బిలియన్ డాలర్లు పెట్టుబడితో భారత్‌లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్‌ఎల్‌ఎంకె గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచంలోని 20 ఉక్కు అగ్రగామి ఉత్పత్తి సంస్థల్లో తాము ఉన్నామని చెప్పారు. అనంతరం చంద్రబాబు బృందం బష్కోరోస్తాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రధానమంత్రి షరనోవ్ డిమిత్రితో చర్చలు జరిపారు. షరనోవ్ డిమిత్రి మాట్లాడుతూ తమ రాజధాని ఉఫాలో ఇటీవల బ్రిక్స్ సమావేశం జరిగిందని, చమురు శుద్ధిలో తమ టెక్నాలజీ ప్రపంచంలోనే ఉత్తమమైందని, ఇతర ప్రాసెసింగ్ పద్ధతులతో పోల్చితే 40 శాతం వ్యయం తక్కువని వివరించారు. టెలివిజన్ పరికరాలు, ఎయిర్ క్రాప్ట్ ఇంజన్ల తయారీలో ముందున్నట్టు చెప్పారు. ఈ సమావేశాల తర్వాత సిఎం బృందం పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరింది.

చిత్రం... సెయంట్ పీటర్స్‌బర్గ్‌లో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యం