జాతీయ వార్తలు

ఫిరాయింపుల తెలంగాణగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: బంగారు తెలంగాణ మాటెలా ఉన్నా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫిరాయింపుల రాష్ట్రంగా మారుస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తాను, తన పార్టీ, తన కుటుంబం తప్పించి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ సభ్యుడి నుంచి ఎంపీ వరకూ ఎవరినీ వదిలిపెట్టకుండా బెదిరించి తన పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధికోసం రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా తెరాస ప్రభుత్వంపై మొట్టమొదటి సారిగా బిజెపి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఇంద్రసేనారెడ్డి, కె లక్షణ్, నాగం జనార్దన్‌రెడ్డి, రామచంద్రరావుతదితరులు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడుతో విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని వారు ఆరోపించారు. టిడిపి టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తెరాసలోకి తీసుకుని మంత్రిని చేశారని, ఇది జరిగి ఏడాది దాటిపోయినా ఇంతవరకూ స్పీకర్ ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆయన విరుచుకుపడ్డారు. తలసానితో ప్రమాణ స్వీకారం చేయించే ముందు రాజ్యాంగ పరిరక్షకునిగా గవర్నర్ కనీస జాగ్రత్తలను తీసుకోలేదన్న విషయాన్ని రాజనాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి పోటీ లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం కాకుండా అడ్డుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. సంక్రాంతి పండుగ సమయంలో ఎన్నికలు నిర్వహించినా, ఓటర్ల జాబితాను తారుమారు చేసినా తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. కాగా హైదరాబాద్‌ను మతతత్వ మజ్లీస్‌కు అప్పగించే దిశలో తెరాస రంగం సిద్ధం చేస్తోందని వారు ఆరోపించారు.

బుధవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
చిత్రంలో నాగం జనార్దనరెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి