రాష్ట్రీయం

రోజుకు 2 కోట్ల మొక్కలు నాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: హరితహారంలో ప్రతిరోజు జిల్లాకు 20 లక్షల చొప్పున రాష్టవ్య్రాప్తంగా 2 కోట్ల మొక్కలు నాటాలని కలెక్టర్లను అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. హరితహారం కార్యక్రమం నిర్వహణపై సచివాలయం నుంచి మంగళవారం సిఎస్ రాజీవ్ శర్మతో కలిసి మంత్రి జోగురామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం కింద జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను నూటికి నూరుపాళ్ళు సాధించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేలకు తక్కువ కాకుండా మొక్కలు నాటాలని, పట్టణ ప్రాంతాల్లో ఒక రోజును ఎంపిక చేసుకొని పెద్ద వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ నెల 18న అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటడానికి క్లస్టర్ అధికారులను నియమించుకోవాలని అధికారులను జోగురామన్న ఆదేశించారు. కలెక్టర్లు స్పందిస్తూ మండలానికి నలుగురు సెక్టోరల్ అధికారులను నియమించినట్టు వివరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ రెండు వారాల హరితహారంలో తమ జిల్లాలో 2.35 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని విధించగా మంగళవారం నాటికి 34 లక్షల మొక్కలు నాటినట్టు వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 319 కిలో మీటర్ల పొడవున రోడ్లకు ఇరు వైపుల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. టాలన్నారు.