రాష్ట్రీయం

రూపేష్‌కు 3రోజులు కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: దక్షిణాఫ్రికాకు చెందిన సింథియా హత్య కేసును మంగళవారం రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. సింథియాను హత్య చేసి తగులబెట్టిన రూపేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. తల్లి దారుణహత్య, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి కుమార్తె సానియా ఒంటరిగా మారింది. చిన్నారి సానియాని తమకు అప్పగించాలని సానియా నాయనమ్మ, సింథియా తరఫు బంధువులు వేర్వేరుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సానియాకు డిఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు కూడా అనుమతించాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా సింథియా దారుణ హత్యపై దర్యాప్తు జరిపేందుకు ఆమె భర్త రూపేష్‌కుమార్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసుల అభ్యర్థన మేరకు నిందితుడు రూపేష్‌కుమార్‌ను మూడురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సింథియా కుమార్తె సానియాకు డిఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 15న సానియా రక్త నమూనాలు సేకరించి ఎస్‌ఎఫ్‌ఎల్‌కు ఇవ్వాలని న్యాయస్థానం వైద్యాధికారులను ఆదేశించింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పర్యవేక్షణలో ఉన్న సానియాను కోర్టు తీర్పు వెలువడే వరకూ ఆమె వారి పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.
ఇ లెర్నింగ్‌కు ఎన్‌ఆర్‌ఐలు సాయం
అమెరికా నుండి తిరుగుపయనమైన గంటా బృందం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 12: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లను అత్యాధునిక టెక్నాలజీతో ఇ లెర్నింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అమెరికాలో చెప్పారు. అమెరికా పర్యటన సత్ఫలితాలను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నుండి గంటా శ్రీనివాసరావు బుధవారం నాడు హైదరాబాద్ చేరుకోనున్నారు. రాష్ట్రంలోని ఐదువేల పాఠశాలల్లో ఇ లెర్నింగ్ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. జూలై 1న అమెరికా చేరుకున్న ఆయన న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులతో చర్చించి అక్కడ పాఠశాలల్లో బోధనా పద్ధతులను పరిశీలించారు. నార్త్ బెర్గన్ స్కూలు యాజమాన్యంతో మంత్రి నేతృత్వంలోని బృందం సమావేశమై ప్రాథమిక విద్యారంగంలో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులను చర్చించింది. 6న పిట్స్‌బర్గ్, 8న డల్లాస్‌ను సందర్శించింది. అనంతరం కాలిఫోర్నియా చేరుకుని అక్కడ కూడా ప్రవాసాంధ్రులతో చర్చించింది. మంత్రి తమ పర్యటనలో భాగంగా న్యూయార్క్, షికాగో, డైటాన్, సిన్‌సినాటి, కొలంబస్, వాషింగ్టన్ డిసి, డల్లాస్, లాస్‌ఏంజెల్స్, సిలికాన్ వాలీల్లోని పాఠశాలలను సందర్శించారు.